Hyderabad Diwali Tragedy : దీపావళి పండగ వేళ విషాదం.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు-tragedy during diwali festival in hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Diwali Tragedy : దీపావళి పండగ వేళ విషాదం.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

Hyderabad Diwali Tragedy : దీపావళి పండగ వేళ విషాదం.. సరోజినిదేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

Basani Shiva Kumar HT Telugu
Nov 01, 2024 11:59 AM IST

Hyderabad Diwali Tragedy : భాగ్యనగరంలో దీపావళి వేళ విషాదం జరిగింది. పటాసులు కాలుస్తూ.. పదుల సంఖ్య గాయపడ్డారు. చికిత్స కోసం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలివచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది వరకు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు.

చికిత్స అందిస్తున్న డాక్టర్
చికిత్స అందిస్తున్న డాక్టర్

హైదరాబాద్ నగరంలో దీపావళి పండగ సంబరాల్లో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. టపాసులు కాలుస్తూ.. చాలామంది గాయపడ్డారు. అక్టోబర్ 31 రాత్రి నుంచి నవంబర్ 1 ఉదయం వరపకు దాదాపు 45 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిలో 34 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.

ప్రతీ ఏడాదిలాగే దీపావళి సందర్భంగా అధికంగా వైద్య సిబ్బంది తో చికిత్సలు అందిస్తున్నట్టు.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బాణసంచా వల్ల గాయాలైన వారు సొంత చికిత్స కాకుండా వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.

జాగ్రత్తలు ఇవీ..

1.దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు తగిన భద్రతా సూచనలు పాటించాలి. బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. మీ ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయండి. పసి పిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.

2.బాణసంచా కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ ఒక బకెట్ నీరు, ఇసుకను అందుబాటులో ఉంచుకోండి. బాణసంచాపై రాసిన సూచనలను జాగ్రత్తగా పాటించండి. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు టపాసులు కాల్చాలి. రాకెట్లు, ఫ్లవర్పాట్లు, ఇతర ఎగిరే క్రాకర్లను గడ్డితో చేసిన ఇళ్లు, ఎండుగడ్డి ఉండే ప్రాంతాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చాలి. మీకు ప్రమాద వశాత్తూ గాయలైనట్లయితే చల్లటి నీటిని గాయాన్ని కడిగి వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

3.దీపావళి టపాసులతో ప్రయోగాలు చేయవద్దు. అవి కాల్చేపుడు మీ ముఖానికి దూరంగా ఉంచుకోవాలి. టపాసులు సరిగ్గా కాలకపోతే.. మళ్లీ వాటిని వెలిగించే ప్రయత్నం చేయవద్దు.

4.విద్యుత్ స్తంభాల దగ్గరగా బాణసంచా కాల్చవద్దు. ఫ్లవర్పాట్లు, హ్యాండ్ బాంబ్లు వంటి బాణాసంచా ను కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు. ఫైర్ క్రాకర్లను వెలిగించి రోడ్లపై ఎక్కడి పడితే అక్కడ బహిరంగంగా విసిరేయకండి. క్రాకర్స్ నుంచి వచ్చే పొగకు దూరంగా ఉండండి. దోమలు పోతాయని ఇంట్లో మతాబులు కాల్చడం వంటి చేయకండి.

5.అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 నెంబర్లను సంప్రదించండి.

పోలీసుల విజ్ఞప్తి..

దీపావళి సందర్భంగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 02 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో.. పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. నగర వాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Whats_app_banner