TOSS Admissions 2023 : ఓపెన్ టెన్త్, ఇంటర్ చదవాలనుకునేవారికి అలర్ట్... అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
Telangana Open School Society:ఈ విద్యా సంవత్సరం(2023-24)లో 10వ తరగతి, ఇంటర్‌లో చేరడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది.
Telangana Open School Society 2023: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) కీలక అలర్ట్ ఇచ్చింది. వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం(2023-24)లో 10వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించనుంది. జులై 10వ తేదీన పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయటంతో పాటు కోర్సుల పూర్తి వివరాలతో కూడిన prospectus ను రిలీజ్ చేయనుంది.
ఇక జులై 10వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అభ్యర్థులు నిర్ణీత ఫీజులను చెల్లించాలని అధికారులు ప్రకటించారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 11 నుంచి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు
BRAOU Admissions 2023- 24: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ మేరకు వర్శిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది. 2023-2024 సంవత్సరానికి గానూ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను పేర్కొంది.
డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. జూలై 31వ తేదీతో ముగియనుంది. ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.
అర్హతలు...
అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.06.2023
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.07.2023.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- అధికారిక వెబ్ సైట్ - https:// www.braouonline.in
ఆయా కోర్సులను బట్టి ఫీజులను ఖరారు చేశారు. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చు.