Karimnagar Crime: కరీంనగర్‌లో ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్… నగదు, నగలు స్వాధీనం.. నిందితులకు రిమాండ్-three robbers arrested in karimnagar cash jewelery seized accused remanded ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Crime: కరీంనగర్‌లో ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్… నగదు, నగలు స్వాధీనం.. నిందితులకు రిమాండ్

Karimnagar Crime: కరీంనగర్‌లో ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్… నగదు, నగలు స్వాధీనం.. నిందితులకు రిమాండ్

HT Telugu Desk HT Telugu
Apr 09, 2024 10:58 AM IST

Karimnagar Crime: కరీంనగర్ లో దోపిడీ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.

కరీంనగర్‌లో దోపిడీ దొంగల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
కరీంనగర్‌లో దోపిడీ దొంగల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Karimnagar Crime: కరీంనగర్‌లో దోపిడీ Robbery gag దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 73 వేల నగదు, ఒక లెనోవో లాప్ టాప్ తో పాటు 20 తులాల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్లు కరీంనగర్ టౌన్ ఏసిపి నరేందర్ ప్రకటించారు.

ప్రయాణీకుడిపై ఆటో డ్రైవర్ దాడి.. దోపిడి

కరీంనగర్ లో ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. ఆటోలో ప్రయాణించే వ్యక్తిపై దాడి చేసి దోపిడికి Robbery పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన షేక్ షబ్బీర్ గత నెల 30న కరీంనగర్ లోని కోతిరాంపూర్ నుండి బస్ స్టాండ్ వెళ్ళుటకు ఆటోలో ప్రయాణించాడు.

ఆటో డ్రైవర్ నూనావత్ తిరుపతి, ఆయన మిత్రుడు మరో ఆటో డ్రైవర్ బానోత్ రాజు ఇద్దరు కలిసి ఆటోలో ప్రయాణించే షేక్ షబ్బీర్ ను సిరిసిల్ల బైపాస్ వైపు తీసుకెళ్లి దాడి చేశారు. అతని వద్ద గల పదమూడు వేల రూపాయల విలువ గల సెల్ ఫోన్ తో పాటు అతని వద్ద ఉన్న బ్యాగ్ లో గల బ్యాంకు పాస్ బుక్ , ఎటిఎం కార్డు , ఇతర కార్డుల ఎత్తుకెళ్లారు.

బాధితుడి మొబైల్ ఫోన్ లోని సిమ్ కార్డును నిందితులు తమ మొబైల్ ఫోన్ లోకి మార్చి బ్యాంకు అకౌంట్ ద్వారా 99 వేల రూపాయలను సైతం అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఇద్దరు నిందితులు చిక్కారని టౌన్ ఏసిపి నరేందర్ తెలిపారు. 392 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్ట్ లో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ చెప్పారు.

అద్దె ఇంటికి కన్నం…

కరీంనగర్ karimnagar కట్టరాంపూర్ కు చెందిన రావుల మారయ్య ఇంట్లో అద్దెకు ఉండే గోపాల్ పూర్ కి చెందిన యువకుడు తోట మహేష్ చోరీకి పాల్పడ్డాడు. కూలీ పని చేసే మహేష్ ఇంటి ఓనర్ మారయ్య ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళగా తాళం పగులగొట్టి లక్ష రూపాయల నగదు , ఒక లెనోవో లాప్ టాప్ తో పాటు 20 తులాల వెండి పట్టీలు మొత్తం 1,28,000 సొత్తును అపహరించాడు.‌

మారయ్యతో ఫిర్యాదు విచారణ చేపట్టిన పోలీసులకు ఇంట్లో అద్దెకు ఉండే మహేష్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. 73 వేల నగదు, ఒక లెనోవో లాప్ టాప్ తో పాటు 20 తులాల వెండి పట్టీలు మొత్తం 1,01,000 సొత్తును స్వాధీన పరచుకుని అతనిపై 457, 380 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ACP ఏసీపీ నరేందర్ తెలిపారు.

చాకచక్యంగా దోపిడి దొంగలు ముగ్గురిని పట్టుకున్న పోలీసులను ఏసిపి నరేందర్ అభినందించారు. అద్దె ఇంటికి కన్నం వేసిన వ్యక్తి, ప్రయాణికుల తీసుకెళ్లే ఆటో డ్రైవర్ దోపిడీ దొంగతనాలకు పాల్పడడం కరీంనగర్ లో కలకలం సృష్టిస్తుంది. అనుమానాస్పదంగా తిరిగేవారి పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు ఇంట్లో కిరాయికి వచ్చేవారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఇళ్ళు అద్దెకు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం