Ration Card e- KYC : రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈకేవైసీ గడువు పెంపు, ఎప్పటివరకంటే-the telangana government has extended the e kyc deadline for ration cards till the end of february ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ration Card E- Kyc : రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈకేవైసీ గడువు పెంపు, ఎప్పటివరకంటే

Ration Card e- KYC : రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈకేవైసీ గడువు పెంపు, ఎప్పటివరకంటే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 28, 2024 06:32 AM IST

Ration Card e- KYC in Telangana : రేషన్ కార్డు ఈకేవైసీ తుది గడువు సమీపించిన వేళ తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి చివరి వరకు గడువు పొడిగించింది.

ఈ-కేవైసీ గడువు పెంపు
ఈ-కేవైసీ గడువు పెంపు

Ration Card e- KYC in Telangana : రేషన్ కార్డుదారులకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈకేవైసీ గడువుపై కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో... ఈ సమయాన్ని ఫిబ్రవరి చివరి వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం… ఫిబ్రవరి నెలాఖరు వరకు సమయాన్ని పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో కూడా రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ 75.76 శాతం పూర్తి అయింది. గడువు పెంచిన నేపథ్యంలో…. ఫిబ్రవరి నెలాఖరుకల్లా వంద శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు.

గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో డీలర్లు ఈకేవైసీ అప్డేట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా రేషన్ అందిస్తోంది. అయితే బోగస్ రేషన్ కార్డులను ఏరివేతకు రేషన్ కార్డుతో ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వాళ్ల పేర్లు అలాగే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేలా ఈకేవైసీ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు. కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది.

మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజారు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈకేవైసీ పూర్తి అయిన తర్వాత…. లబ్ధిదారుల విషయంలో మరింత స్పష్టత రానుంది. ఈ డేటాను కూడా పరిగణనలోకి తీసుకోనుంది సర్కార్. ఈ ప్రక్రియ పూర్తికాగానే… కొత్త రేషన్ కార్డుల మంజారు ప్రక్రియను వేగవంతం చేయనుంది.

ఈకేవైసీ అప్డేట్ ఎలా?

Ration Card E KYC Process: రేషన్‌ కార్డు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడానికి రేషన్‌ కార్డులోని కుటుంబ యజమానితోపాటు కుటుంబ సభ్యులందరూ... రేషన్ షాపు వద్దకు వెళ్లి ఈ పాస్ మిషన్‌లో వేలిముద్రలు వేయాలి.

వేర్వురుగా రేషన్ కార్డు షాప్ కు వెళ్తే ప్రాసెస్ చేయరు.

వేలిముద్రలు వేసిన అనంతరం లబ్దిదారుల ఆధార్ కార్డు నంబర్‌, రేషన్ కార్డు నంబర్ ఈపాస్ లో డిస్‌ప్లే అవుతుంది.

ఈ-పాస్ మిషన్ లో గ్రీన్ లైట్ వచ్చి ఈకేవైసీ అప్డేటేడ్ అని వస్తుంది.

ఒకవేళ రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే లబ్దిదారుడి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు సరిపోలడం లేదని అర్థం. దీంతో ఆ రేషన్‌ కార్డును తొలగిస్తారు.

రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారంతా ఒకేసారి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి.

Whats_app_banner