Arunachalam Tour : గుడ్ న్యూస్.. అరుణాచల 'గిరి ప్రదక్షిణ'కు ప్రత్యేక బస్సులు - TGSRTC టూర్ ప్యాకేజీ ఇదే
TGSRTC Arunachalam Tour Package : అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఇందుకోసం టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
TGSRTC Arunachalam Tour Package : తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, కరీంనగర్, ఖమ్మం, మహబుబ్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించి బుకింగ్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ టూరిజం ప్యాకేజీ….
ప్రతీ నెల పౌర్ణమి రోజున అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం చాలా మంది భక్తులు వెళ్తుంటారు. కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా… మరికొందరు ట్రైన్ లేదా ఇతర మార్గాల్లో వెళ్తుంటారు. అయితే తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతోంది.
- అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
- HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
- ఈ నెలలో వెళ్తేందుకు కూడా టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ మాసంలో జులై 20వ తేదీన గిరి ప్రదక్షణ ఉండనుంది. ఇందుకు తగ్గట్టుగానే టూర్ ప్యాకేజీ ఆపరేటింగ్ ఉంటుంది.
- పెద్దలకు రూ. 8000, పిల్లలకు రూ.6400వేల టికెట్ ధరగా నిర్ణయించారు.
- ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు సాయంత్రం 6:30 గంటలకు బషీర్ బాగ్ నుంచి బస్సు బయల్దేరుతారు.
- రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
- మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. Sripuram Golden Temple Darshan ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
- నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలతో పాటు బుకింగ్ చేసుకోవాలంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
- వివరాల కోసం info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
- వెబ్ సైట్ - https://tourism.telangana.gov.in/