Arunachalam Tour : అరుణాచలం గిరి ప్రదక్షిణ - 4 రోజుల ఈ టూర్ ప్యాకేజీ చూడండి...!
Telangana Tourism Arunachalam Tour : అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునేవారి కోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. షెడ్యూల్ తో పాటు బుకింగ్ వివరాలను ఇక్కడ చూడండి…
ప్రతీ నెల పౌర్ణమి రోజున అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం చాలా మంది భక్తులు వెళ్తుంటారు. కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా… మరికొందరు ట్రైన్ లేదా ఇతర మార్గాల్లో వెళ్తుంటారు. అయితే తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. నాలుగు రోజుల పాటు ఈ టూర్ సాగుతోంది.
అరుణాచలం టూర్ ప్యాకేజీ వివరాలు….
- అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
- HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
- ఈ నెలలో వెళ్తేందుకు కూడా టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ మాసంలో జులై 20వ తేదీన గిరి ప్రదక్షణ ఉండనుంది. ఇందుకు తగ్గట్టుగానే టూర్ ప్యాకేజీ ఆపరేటింగ్ ఉంటుంది.
- పెద్దలకు రూ. 8000, పిల్లలకు రూ.6400వేల టికెట్ ధరగా నిర్ణయించారు.
- ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు సాయంత్రం 6:30 గంటలకు బషీర్ బాగ్ నుంచి బస్సు బయల్దేరుతారు.
- రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
- మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. Sripuram Golden Temple Darshan ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
- నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలతో పాటు బుకింగ్ చేసుకోవాలంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
- వివరాల కోసం info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
- వెబ్ సైట్ - https://tourism.telangana.gov.in/
గిరి ప్రదక్షిణకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు….
ఈనెల 20న పుణ్యక్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై) గిరి ప్రదక్షిణ కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసులు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడులోని అరుణాచలానికి నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. భక్తులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
పశ్చిమ గోదావరి జిల్లా తుని నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు అరుణాచలం గిరి ప్రదక్షిణతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా సర్వీస్ నడుపుతున్నారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు తుని బస్ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకున్న తరువాత అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్తుంది. గిరి ప్రదక్షిణ అనంతరం కంచి దర్శనం చేసుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనాలు ముగించుకుని జులై 22 న తిరిగి వస్తాయి. ఈ బస్సులో ప్రయాణం చేసేందుకు పెద్దలకు ఒక్కొక్కరికి టిక్కెట్లు ఛార్జ్ రూ.3,500, పిల్లలకు రూ.2,625 నిర్ణయించారు.
టికెట్ రిజర్వ్ చేసుకునేవారు డిపో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. వివరాలకు 7382913216, 8555058080, 7330651904, 7382913016 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తుని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్.కిరణ్ కుమార్ తెలిపారు.
కడప జిల్లా నుంచి పుణ్యక్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై) గిరి ప్రదక్షిణకు పది బస్సు సర్వీసులు అందుబాటులోకి ఏపీఎస్ఆర్టీసీ తెచ్చింది. అందులో భాగంగా ఏ బస్సు ఎక్కడ నుంచి ఎప్పుడు బయలు దేరుతుందో అనే వివరాలు కడప జిల్లా ఆర్టీసీ అధికారి పొలిమేర గోపాల్ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి ఈనెల 20న రాత్రి 9 గంటలకు అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సు బయలు దేరుతుంది. ఈ సర్వీస్ రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా అరుణాచలం చేరుకుంటుంది. రానుపోను టిక్కెట్టు ధర రూ.1,072గా నిర్ణయించామని తెలిపారు.
మరోవైపు ప్రొద్దుటూరు డిపో నుంచి ఈనెల 20న సాయంత్రం 5 గంటలకు, 6 గంటలకు రెండు బస్సు సర్వీసులు మైదుకూరు, కడప మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. టిక్కెట్టు ధర రూ.1,273గా నిర్ణయించామన్నారు. జమ్మలమడుగు డిపో నుంచి ఈనెల 20న ఉదయం 5.30 గంటలకు బయలుదేరే బస్సు ఛార్జీ 1,352గా నిర్ణయించామని, మరో బస్సు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందని, దాని ఛార్జీ రూ.1,568గా నుందని అన్నారు. ఈ రెండు సర్వీసులు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా అరుణాచలం చేరుకుంటుంది.
సంబంధిత కథనం