Mission Bhagiratha wins Centre's Award: మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు
Mission Bhagiratha wins Centre's Award: తెలంగాణలో ఇంటింటికి శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది.
Mission Bhagiratha wins Centre's Award: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి గుర్తించింది. తెలంగాణలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఈ పథకానికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.
Mission Bhagiratha wins Centre's Award: జల్ జీవన్ మిషన్
శుద్ధి చేసిన తాగు నీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందజేస్తూ “మిషన్ భగీరథ” దేశానికే ఆదర్శంగా నిలిచింది. మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా పరిశీలించింది. తెలంగాణ వ్యాప్తంగా రాండమ్ గా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే , ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించింది.
Mission Bhagiratha wins Centre's Award: తలసరిగా 100 లీటర్లు
మిషన్ భగీరథతో ప్రతీ రోజూ ఇంటింటికి నల్లాతో నాణ్యమైన తాగునీరు తలసరిగా 100 లీటర్లు అందుతున్నట్టు గుర్తించింది. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం నాణ్యత మరియు పరిమాణంలో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది. అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా నిరాటంకంగా , ప్రతిరోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించింది. అనంతరం, ఈ పథకాన్ని జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది.
Mission Bhagiratha wins Centre's Award: ఢిల్లీలో ప్రదానం
అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు ఢిల్లీలో అవార్డును అందుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆహ్వానించింది. తెలంగాణ ప్రగతిని గుర్తించి, మరో సారి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినందుకు, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.