TS Model School Hall Tickets : తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల హాల్ టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే
Telangana Model School Hall Tickets 2024: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా… 2024 -25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఎగ్జామ్ జరగనుంది.
Telangana Model School Hall Tickets 2024: తెలంగాణ మోడల్ స్కూల్(Telangana Model School Admissions) ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా.... 6వ తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా...7 -10 తరగతుల్లో ఖాళీ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కావటంతో....ఏప్రిల్ 1వ తేదీ నుంచి హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 7వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS Model School Hall Tickets Download : ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు….
- 6వ తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు… హోంపేజీలో కనిపించే Download Hall Ticket అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇందులో Candidate Id / Reference Id మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఇలా కాకుండా… మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయవచ్చు. ఆ తర్వాత Go అనే బటన్ పై నొక్కితే…. హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
- 7 -10 తరగతుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పైన పేర్కొన్న వెబ్ సైట్ లోకే వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే…. Notification - TSMS VII TO X CLASS - 2024 ఆప్షన్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉండే హాల్ టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ ను పొందవచ్చు.
ముఖ్య వివరాలు:
- పరీక్ష తేదీ - ఏప్రిల్ 7, 2024.
- టైమింగ్స్ -ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతి వారికి, ➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.
- ఎగ్జామ్ సెంటర్ - అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
- పరీక్ష విధానం - మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం - 2 గంటలు.
- ఎంపిక విధానం - ప్రవేశ పరీక్ష ఆధారంగా
- అధికారిక వెబ్ సైట్ - https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/
APMS Inter Admissions 2024: మరోవైపు ఏపీ మోడల్ స్కూళ్లలోని ఇంటర్ ప్రవేశాలకు(APMS Inter Admissions 2024) సంబంధించి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా.... 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు కల్పిస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ఈ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి. మార్చి 28 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 22వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ వివరాలను పేర్కొంది. పదో తరగతి అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం పరీక్ష రాసే వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.