Scholarship | విద్యార్థులూ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ కు అప్లై చేసుకున్నారా?-telangana govt registrations open in e pass for scholarships know application process here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scholarship | విద్యార్థులూ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ కు అప్లై చేసుకున్నారా?

Scholarship | విద్యార్థులూ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ కు అప్లై చేసుకున్నారా?

HT Telugu Desk HT Telugu
May 16, 2022 03:08 PM IST

తెలంగాణ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు మెుదలయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్ ఈ-పాస్ పోర్టల్ వెళ్లి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

<p>స్కాలర్ షిప్స్</p>
స్కాలర్ షిప్స్

పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను(PMS) ప్రభుత్వం ఇచ్చే విషయం తెలిసిందే. అయితే వీటి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ప్రభుత్వ వెబ్ సైట్ ఈ- పాస్ పోర్టల్ నుంచి నమోదు కావాలి. మే11 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మే 21గా చివరి తేదీగా నిర్ణయించారు.

తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనకబడిన తరగతి (BC), ఆర్థికంగా వెనకబడిన తరగతి (EBC), మైనారిటీలు, శారీరక వికలాంగ విద్యార్థుల ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. 2021-22 సంబంధించిన రెన్యూవల్ చేసుకునేవారు కూడా చేసుకోవచ్చు. దీంతోపాటుగా తాజా స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం అప్లై చేసుకోవాలి. విద్యార్థులు తమ వివరాలను అక్టోబర్ 24లోపు అప్‌లోడ్ చేయాలి.

అర్హత ఏంటంటే..

SC, ST వర్గానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు, అంతకంటే తక్కువగా అయి ఉండాలి. BC, EBC, వికలాంగ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష, అంతకంటే తక్కువగా ఉండాలి. అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం అప్లై చేయాలనుకునేవారి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75%గా ఉండేలా చూసుకోవాలి.

కావాల్సిన పత్రాలు

పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల అప్లై చేయాలనుకునేవారు.. క్వాలిఫైయింగ్ పరీక్ష మార్క్ షీట్‌ మాత్రమే కాకుండా.. ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాలి.

అర్హత కలిగిన విద్యార్థులు టీఎస్ ఈ పాస్ అధికారిక వెబ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థికి సంబంధించిన వివరాలను పూర్తిగా నమోదు చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత..దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకుని.. సంబంధిత పాఠశాల, కళాశాలకు సమర్పించాలి. ఒకవేళ తప్పుడు సమాచారం ఏదైనా నమోదు చేస్తే.. దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది.

గమనిక: ఈ కింది లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం