Telangana: ప్రజలకు గుడ్ న్యూస్… రేషన్​ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ సేవలు-telangana govt key decision on arogyashree scheme full details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana: ప్రజలకు గుడ్ న్యూస్… రేషన్​ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ సేవలు

Telangana: ప్రజలకు గుడ్ న్యూస్… రేషన్​ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ సేవలు

Mahendra Maheshwaram HT Telugu
Aug 19, 2022 05:09 PM IST

ఆరోగ్య శ్రీ కార్డు విషయంలో... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది.

<p>ఆరోగ్య శ్రీపై తెలంగాణ. ప్రభుత్వం కీలక నిర్ణయం</p>
ఆరోగ్య శ్రీపై తెలంగాణ. ప్రభుత్వం కీలక నిర్ణయం

telangana govt key decision on arogyashree: ఆరోగ్య శ్రీ సేవల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలని ఇకపై ఆహార భద్రత కార్డుపై కూడా చెల్లు బాటయ్యేలా నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత... కొన్ని మార్పులు వచ్చాయి. తెల్లకార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. అయితే ఇవి కేవలం రేషన్‌ సరుకుల తీసుకోవటానికి మాత్రమే ఉపయోపడేవి. కానీ ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డుగానీ, లేదా తెల్ల రేషన్‌ కార్డుగానీ ఉండాలనే నిబంధన ఉంది. ఫలితంగా ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరం అయిపోయారు.

ఈ విషయంలో ప్రజల నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని...ఊరట కల్పించింది. ఇకపై ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఉచిత సేవలు పొందే అవకాశం దొరికింది.

నిజానికి తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని చాలా రోజుల వరకు అమలు చేయలేదు. సీఎం కేసీఆర్ కూడా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. పెద్దగా లాభం లేదంటూ చెప్పుకొచ్చారు. తర్వాత కాలంలో నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలోనూ ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు దక్కించుకుంది. ఈ పథకం కింద భారీ స్థాయిలో పేదలు లబ్ధి పొందారు.

Whats_app_banner

సంబంధిత కథనం