TS GOVERNOR : విమాన ప్రయాణికుడికి తెలంగాణ గవర్నర్‌ అత్యవసర చికిత్స-telangana governor treats on board passenger in emergency situation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Governor : విమాన ప్రయాణికుడికి తెలంగాణ గవర్నర్‌ అత్యవసర చికిత్స

TS GOVERNOR : విమాన ప్రయాణికుడికి తెలంగాణ గవర్నర్‌ అత్యవసర చికిత్స

HT Telugu Desk HT Telugu
Jul 23, 2022 11:25 AM IST

ఛాతీ నొప్పితో విలవిలలాడుతున్న విమాన ప్రయాణికుడికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. అర్థరాత్రి విమాన ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. వారణాసి నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణంలో ఉన్న గవర్నర్‌ తోటి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. గవర్నర్‌ ప్రయాణికుడికి చికిత్స చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి.

<p>విమాన ప్రయాణికుడికి చికిత్స అందిస్తున్న గవర్నర్ తమిళిసై</p>
విమాన ప్రయాణికుడికి చికిత్స అందిస్తున్న గవర్నర్ తమిళిసై

విమాన ప్రయాణంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అత్యవసర చికిత్సనందించారు. వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీ- హైదరాబాద్ మధ్య అర్ధరాత్రి నడిచే ఇండిగో విమానంలో గవర్నర్‌ ప్రయాణిస్తున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యారు. విమాన సిబ్బంది ప్రకటనతో విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.

విమానం టేకాఫ్‌ అయిన తర్వాత ప్రయాణికుడు ఛాతీ నొప్పికి గురయ్యాడు. విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు. విషయం తెలిసిన వెంటనే గవర్నర్‌ వెంటనే స్పందించారు. తెలంగాణ గవర్నర్‌ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించి ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.

<p>విమానంలో గవర్నర్‌ చికిత్స చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి</p>
విమానంలో గవర్నర్‌ చికిత్స చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి

ప్రథమ చికిత్స అందడంతో కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు అదేవిధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు అభినందనలు తెలిపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు చికిత్స క్రమాన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్యవిద్యలో ఉన్నత విద్యా వంతురాలు. ఎంబిబిఎస్‌ తర్వాత డిజిఓ కూడా పూర్తిచేశారు. ఆపత్కాలంగా ప్రయాణికుడికి చికిత్స అందించిన చిత్రాలు వెలుగులోకి రావడంతో గవర్నర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.

Whats_app_banner