TS Teachers Transfers : టీచర్ల బదిలీల షెడ్యూల్‌ విడుదల - 3వ తేదీ నుంచి ఆన్‍లైన్‍ దరఖాస్తులు-telangana government releases schedule for teacher transfers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Teachers Transfers : టీచర్ల బదిలీల షెడ్యూల్‌ విడుదల - 3వ తేదీ నుంచి ఆన్‍లైన్‍ దరఖాస్తులు

TS Teachers Transfers : టీచర్ల బదిలీల షెడ్యూల్‌ విడుదల - 3వ తేదీ నుంచి ఆన్‍లైన్‍ దరఖాస్తులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 01, 2023 02:13 PM IST

Teachers Transfers in Telangana : టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ఖరారు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది.

తెలంగాణలో టీచర్ల బదిలీలు
తెలంగాణలో టీచర్ల బదిలీలు

TS Teachers Transfers Schedule 2023: రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ కానుంది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ నెల 3 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

షెడ్యూల్ ఇదే:

-రాష్ట్రంలోని టీచర్లు పదోన్నతులు బదిలీలు కోరుకుంటున్న వారు ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

-6,7 తేదీల్లో ఆన్ లైన్ అప్లికేషన్ కాపీలను డీఈవో కార్యాలయంలో ఇవ్వాలి.

-8, 9 తేదీల్లో దరఖాస్తు చేసిన వారి పేర్లను డిస్‌ప్లే చేస్తారు.

-10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరిస్తారు.

-12,13 తేదీల్లో సీనియారిటీ జాబితా డిస్‌ప్లే చేస్తారు.

-14వ తేదీన ఎడిట్‌ చేసుకునేందుకు ఆప్షన్‌ ఇస్తారు.

-సెప్టెంబర్ 15న ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరుపుతారు.

16న ప్రధానోపాధ్యాయుల ఖాళీ ల ప్రదర్శన, 17,18,19 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంలుగా ప్రమోషన్స్ ఇస్తారు. 20,21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ను డిస్ ప్లే చేస్తారు. 21న వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 22న ఎడిట్‌ ఆప్షన్‌ అవకాశం కల్పిస్తారు. 23,24 స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలు జరుగుతాయి. దానికనుగుణంగా 24 స్కూల్‌ అస్టింట్‌ ఖాళీ లు వెల్లడిస్తారు. 26,27,28 తేదీల్లో ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు ఇస్తారు. 29,30,31వ తేదీల్లో SGT ఖాళీల ప్రదర్శన, అక్టోబర్‌ 2న ఎడిట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. అక్టోబర్‌ 3న ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల ట్రాన్స్ఫర్ లు చేస్తారు. అక్టోబర్‌ 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు.

కొన్ని నెలల కిందటే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టాలని సర్కార్ భావించింది. అయితే కోర్టు వివాదాలతో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. బుధవారం హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో… ఈ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకువచ్చిన జీవో 5 అమలును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

Whats_app_banner