Telangana Cabinet Meeting : రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ నిర్ణయం - కటాఫ్ తేదీ ఇదే-telangana cabinet has decided to waive crop loans cutoff date check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cabinet Meeting : రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ నిర్ణయం - కటాఫ్ తేదీ ఇదే

Telangana Cabinet Meeting : రైతు రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ నిర్ణయం - కటాఫ్ తేదీ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 21, 2024 06:29 PM IST

Telangana Cabinet Meeting Updates : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంట రుణాల మాఫీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కటాఫ్ తేదీని కూడా ఖరారు చేసింది.

తెలంగాణ కేబినెట్(File Photo)
తెలంగాణ కేబినెట్(File Photo)

Telangana Cabinet Meeting : తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట రుణాల మాఫీకి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్‌ 9కి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా రుణమాఫీతో పాటు రైతుభరోసా విధివిధానాలపై చర్చ జరిగింది.  రుణమాఫీ అమలుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీని తుది గడువుగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రుణాలన్నింటిని ఏకకాలంలో చేయనుంది.

Whats_app_banner