AP New Cabinet : చంద్రబాబు కేబినెట్ సీనియర్ జూనియర్ల జట్టు-అతి పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత-amaravati chandrababu new cabinet vangalapudi anitha junior minister nmd farooq senior ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Cabinet : చంద్రబాబు కేబినెట్ సీనియర్ జూనియర్ల జట్టు-అతి పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత

AP New Cabinet : చంద్రబాబు కేబినెట్ సీనియర్ జూనియర్ల జట్టు-అతి పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత

AP New Cabinet : ఏపీలో కొత్త కేబినెట్ సీనియర్లు, జూనియర్ల కలయికతో సమతూకంగా ఉంది. కేబినెట్ లో పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత(42) ఉంటే సీనియర్ మంత్రిగా ఎన్ఎండీ ఫరూక్ (75) ఉన్నారు.

చంద్రబాబు కేబినెట్ సీనియర్ జూనియర్ల జట్టు

AP New Cabinet : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు 24 మంత్రులు ప్రమాణం చేశారు. అయితే ఈసారి కేబినెట్ కూర్పులో చంద్రబాబు సీనియర్ జూనియర్ ఈక్వేషన్ ఫాలో అయ్యారు. ఏపీ కొత్త కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత(40) నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఆమెకు చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కింది. వంగపూడి అనిత కొత్త కేబినెట్ లో అతి పిన్న వయస్కురాలిగా ఉన్నారు. అనిత తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామ ప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు. 70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్ (75), నారా చంద్రబాబు నాయుడు (74), ఆనం రామ నారాయణ రెడ్డి (71) ఉన్నారు. అలాగే 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నారు.

కాస్ట్ ఈక్వేషన్స్

ఏపీ కేబినెట్ లో 17 మంది కొత్తవారే ఉండడం గమనార్హం. వీరిలో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి కేబినెట్ లో అవకాశం దక్కింది. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌ మంత్రివర్గంలో చోటు లభించింది. బీజేపీ నుంచి సత్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు చంద్రబాబు కేబినెట్ లో అవకాశమిచ్చారు.

కొత్త మంత్రులు వీరే

  1. పవన్‌ కల్యాణ్‌ (జనసేన)
  2. నారా లోకేశ్‌ (టీడీపీ)
  3. అచ్చెన్నాయుడు (టీడీపీ)
  4. కొల్లు రవీంద్ర (టీడీపీ)
  5. నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
  6. పి. నారాయణ (టీడీపీ)
  7. వంగలపూడి అనిత (టీడీపీ)
  8. సత్యకుమార్‌ యాదవ్‌ (బీజేపీ)
  9. నిమ్మల రామానాయుడు (టీడీపీ)
  10. ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌ (టీడీపీ)
  11. ఆనం రామనారాయణరెడ్డి (టీడీపీ)
  12. పయ్యావుల కేశవ్‌ (టీడీపీ)
  13. అనగాని సత్యప్రసాద్‌ (టీడీపీ)
  14. కొలుసు పార్థసారథి (టీడీపీ)
  15. డోలా బాలవీరాంజనేయస్వామి (టీడీపీ)
  16. గొట్టిపాటి రవి (టీడీపీ)
  17. కందుల దుర్గేశ్‌ (జనసేన)
  18. గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ)
  19. బీసీ జనార్దన్‌రెడ్డి (టీడీపీ)
  20. టీజీ భరత్‌ (టీడీపీ)
  21. ఎస్‌.సవిత (టీడీపీ)
  22. వాసంశెట్టి సుభాష్‌ (టీడీపీ)
  23. కొండపల్లి శ్రీనివాస్‌ (టీడీపీ)
  24. మందిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి (టీడీపీ)

సంబంధిత కథనం