Liquor Case: సుఖేశ్ మరో సంచలనం... ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనట!-sukesh chandrashekhar releases whatsapp chat with brs mlc kavitha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Liquor Case: సుఖేశ్ మరో సంచలనం... ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనట!

Liquor Case: సుఖేశ్ మరో సంచలనం... ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనట!

HT Telugu Desk HT Telugu
Apr 12, 2023 03:18 PM IST

Sukesh Chandrasekar Letter: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు. ఢిల్లీ లెప్ఠినెంట్ గవర్నర్ కు రాసిన లేఖలో… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ను కూడా బయటపెట్టాడు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఈ లేఖను విడుదల చేశారు.

వెలుగులోకి వాట్సాప్ చాట్...!
వెలుగులోకి వాట్సాప్ చాట్...!

Delhi Liquor Case Updates: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మరో లేఖ సంచలనం సృష్టిస్తోంది. మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. తన అడ్వొకేట్ ద్వారా తాజాగా మరో లేఖను విడుదల చేశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు రాసిన లేఖలో లిక్కర్ కేసుకు సంబంధించిన పలు ఆధారాలను సమర్పించాడు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్ స్క్రీన్ షాట్ లను కూడా జత చేశాడు. ఇందులో కవితను అక్కా అని సుఖేష్ చంద్రశేఖర్ సంబోధించాడు.

ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే రెండు సార్లు లేఖలను విడుదల చేసిన సుఖేశ్... సంచలన విషయాలను బయటపెట్టాడు. కేజ్రీవాల్ ను ఉద్దేశిస్తూ... జస్ట్ ట్రైలర్ మాత్రమే అని... అసలు సిన్మా ముందు ఉందంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చాడు. చాటింగ్ లు కూడా బయటపెడతనంటూ ముందే చెప్పిన సుఖేశ్... ఇప్పుడు వాటిని కూడా రిలీజ్ చేశాడు. చెప్పినట్లే తన లాయర్ ద్వారా కవితతో చేసిన చాటింగ్స్ ను బయటపెట్టాడు.

అక్క అంటూ చాటింగ్...

సుఖేశ్‌ అక్కడక్కడా తెలుగు పదాలను కూడా ఉపయోగించినట్లు చాట్ లో ఉంది. పలుమార్లు అక్క అంటూ సంబోధించాడు. దీనిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెలివరీకి సంబంధించిన చాట్ జరిగినట్లు ఇందులో ఉండగా... ఈ కాస్త సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

కొద్దిరోజుల కిందటే కేజ్రీవాల్ టార్గెట్ గా కీలక విషయాలను ప్రస్తావించాడు సుఖేశ్. కేజ్రీవాల్ చెప్పినట్లే 2020లో టీఆర్ఎస్(BRS)కు కు రూ. 75 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ కూడా ఉన్నాయని తెలిపాడు. మొత్తం 700 పేజీలతో కూడా చాట్ ఉందని స్పష్టం చేశాడు. ఈ మేరకు తన తరపు అడ్వొకేట్ అనంత్ మాలిక్ ద్వారా లేఖను విడుదల చేశాడు. అందులో ఈ వివరాలను పేర్కొన్నాడు. " కేజ్రీవాల్ జీ... 2020 ఏడాదిలో 15 కేజీల నెయ్యి(కోడ్ - 15 కోట్లు)కి సంబంధించిన చాట్ బయటపెడ్తాను. నువ్వు, మిస్టర్ జైన్.. నా ద్వారా టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు పంపిన విషయాన్ని బయటపెడ్తాను" అంటూ సుఖేష్ రాసుకొచ్చాడు హైదరాబాద్ లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద లిక్కర్ కేసు నిందితుల్లో ఒకరికి ఈ నగదు ఇచ్చినట్లు తెలిపాడు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న 'ఏపీ' అనే వ్యక్తికి ఈ 15 కోట్లు ఇచ్చానని తెలిపాడు. ఇప్పటికే 5 నెయ్యి కేసులు హైదరాబాద్‌కు పంపించినట్లుగా చెప్పుకొచ్చాడు. హైదారాబాద్‌కు మొత్తం రూ.75 కోట్లు చేరవేశానని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Whats_app_banner

సంబంధిత కథనం