South Central Railway : రైల్వే స్టేషన్లలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌-south central railway rail tel finalises agencies to execute vss work know more details inside ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  South Central Railway : రైల్వే స్టేషన్లలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌

South Central Railway : రైల్వే స్టేషన్లలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌

HT Telugu Desk HT Telugu
Jul 07, 2022 04:10 PM IST

SCR : రైల్వే స్టేషన్లలో నిర్భయ ఫండ్ కింద వీడియో సర్వైలెన్స్ సిస్టమ్(వీఎస్ఎస్)ను ఏర్పాటు చేయనున్నట్టుగా రైల్ టెల్ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వేలోని.. పలు స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ మధ్య రైల్వేలోని 76 రైల్వే స్టేషన్‌లలో వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ (VSS)ను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఏజెన్సీలను ఖరారు చేసింది దక్షిణ మధ్య రైల్వే. నిర్భయ ఫండ్ కింద వీఎస్ఎస్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా కేటగిరీ A1, A, B, C (756) ప్రధాన స్టేషన్లను కవర్ చేస్తుంది.

SCR అధికార పరిధిలో 76 స్టేషన్లు ఎంపిక చేశారు. జనవరి 2023 నాటికి పని పూర్తయ్యే అవకాశం ఉంది. మిగిలిన స్టేషన్లు 2వ దశలో పూర్తి చేస్తారు. ప్రధాన రవాణా కేంద్రాలుగా ఉన్న రైల్వే స్టేషన్లలో భద్రతను పెంపొందించేందుకు, రైల్వే స్టేషన్లలో (వెయిటింగ్ హాళ్లు, రిజర్వేషన్ కౌంటర్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన ద్వారం/ ఎగ్జిట్, ప్లాట్‌ఫారమ్‌లు) ఇంటర్నెట్ తో అనుసంధానించిన వీఎస్ఎస్ ను ఇన్ స్టాల్ చేస్తారు. దీని ఆధారంగా.. భద్రత ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

CCTVల వీడియో ఫీడ్ స్థానిక ఆర్పీఎఫ్ తో మాత్రమే కాకుండా CCTV కంట్రోల్ రూమ్‌, డివిజన్, జోనల్ స్థాయిలో కూడా చూసేందుకు వీలుంటుంది. రైల్వే ప్రాంగణంలో మెరుగైన భద్రత, భద్రతను నిర్ధారించడానికి వీడియో ఫీడ్‌లు మూడు స్థాయిలలో పర్యవేక్షిస్తారు. కెమెరాలు, సర్వర్, UPS, స్విచ్‌ల పర్యవేక్షణ కోసం నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (NMS) కూడా పెడుతున్నారు. వీటిని ఏదైనా వెబ్ బ్రౌజర్ నుండి వీక్షించవచ్చు.

నాలుగు రకాల IP కెమెరాలు (డోమ్, బుల్లెట్, పాన్ టిల్ట్ జూమ్ రకం మరియు అల్ట్రా HD- 4k) ఇన్‌స్టాల్ చేస్తారు. వీడియో ఫీడ్‌లు 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం స్టోర్ చేస్తారు. చొరబాట్లను గుర్తించడం, కెమెరాను ట్యాంపరింగ్ చేయడం, సంచరించేవారిని గుర్తించడం, మనుషులను, వాహనాన్ని గుర్తించడం, మనుషులను వెతకడం వంటివి జరిగినప్పుడు అలారం అలర్ట్ చేస్తుంది.

స్టేషన్లలోని ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో రెండు పానిక్ బటన్‌లు కూడా ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తి ఎవరైనా యాక్టివేట్ చేసిన తర్వాత, ఆపరేటర్ వర్క్‌స్టేషన్‌లో అనుబంధిత కెమెరా పాప్-అప్‌తో పాటు స్క్రీన్‌లపై అలారం కనిపిస్తుంది

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, దబీర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, జామియా ఉస్మానియా, మలక్‌పేట్, సీతాఫల్మండి, విద్యానగర్, యాకుత్‌పురా, భరత్‌నగర్, బోరబండ, చందానగర్, ఫతేనగర్ వంతెన, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నేచర్ క్యూర్ హాస్పిటల్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, వరంగల్, బేగంపేట, భద్రాచలం రోడ్, కాజీపేట, ఖమ్మం, లింగంపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, తాండూరు, వికారాబాద్, పర్లి వైజనాథ్, కాచిగూడ, కామారెడ్డి తదితర స్టేషన్లలో ఈ వీడియో వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ ఇన్ స్టాల్ చేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం