Hyderabad Liberation: సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం-september 17 is officially hyderabad liberation day center issued notification ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Liberation: సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

Hyderabad Liberation: సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

Sarath chandra.B HT Telugu
Mar 13, 2024 09:08 AM IST

Hyderabad Liberation: దేశ స్వాతంత్య్రం తర్వాత నిజాం Nizam పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలిపిన సెప్టెంబర్ 17న విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇకపై అధికారికంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం
ఇకపై అధికారికంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం

Hyderabad Liberation: భారతదేశంలో హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేసిన సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా నిర్వహించాలని కేంద్రం Union Govt నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ Notification జారీ చేసింది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ Hyderabad విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న

లోక్‌సభ Lokasbha ఎన్నికల వేళ సెప్టెంబర్ 17కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా నిర్వహించనున్నారు.

''భారత్‌ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్‌ సంస్థానం 13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య 'ఆపరేషన్‌ పోలో'తో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైంది. సెప్టెంబర్‌ 17న 'హైదరాబాద్‌ విమోచన దినం' నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్‌ 17న 'హైదరాబాద్‌ విమోచన దినం' నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది'' అని హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

సెప్టెంబర్‌ 17వ తేదీని భారత్ యూనియన్‌లో కలపడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలపై పెద్దఎత్తున కమ్యూనిస్టులు కూడా ఉద్యమించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా సంస్థానాలు సొంత రాజ్యాలుగా ఉండిపోయాయి. వల్లభ్‌ భాయ్ పటేల్ నిర్ణయంతో కఠిన చర్యలతో స్వతంత్ర రాజ్యాలన్నీ భారతదేశంలో భాగంగా మారాయి.

దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ విషయంలో మాత్రం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. 1948 సెప్టెంబర్ హైదరాబాద్ సంస్థానం లొంగిపోయిన నేపథ్యంలో జరిగిన రాజకీయ, సైనిక పరిణామాలపై భిన్న వాదనలు ఉన్నాయి. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవం, విమోచన దినం, విముక్తి దినం, విద్రోహ దినంగా రకరకాల రాజకీయ వాదనలు ఉన్నాయి.

సెప్టెంబర్‌ 17 విషయంలో మతపరమైన భావోద్వేగాలతో ముడిపడి ఉండటంతో దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపడానికి అధికారంలో ఉన్న పార్టీలు వెనుకంజ వేశాయి.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంనిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఏటా సెప్టెంబర్‌ 17న 'హైదరాబాద్‌ లిబరేషన్‌ డే' (Hyderabad Liberation Day) నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో పేర్కొంది.

Whats_app_banner