RRB Technician Applications : రైల్వే శాఖలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలు-ఇలా దరఖాస్తు చేసుకోండి!-secunderabad news in telugu rrb technician notification released apply important dates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rrb Technician Applications : రైల్వే శాఖలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలు-ఇలా దరఖాస్తు చేసుకోండి!

RRB Technician Applications : రైల్వే శాఖలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలు-ఇలా దరఖాస్తు చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Mar 10, 2024 07:03 PM IST

RRB Technician Applications : దేశవ్యాప్తంగా 9144 టెక్నీషియన్ల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.

ఆర్ఆర్బీల్లో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలు
ఆర్ఆర్బీల్లో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలు

RRB Technician Applications : రైల్వే శాఖ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఆర్.ఆర్.బిలలో ఖాళీగా ఉన్న 9,144 రైల్వే టెక్నీషియన్ పోస్టుల(RRB Technician Recruitment) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఏప్రిల్ 9 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులకు ఎడిట్ ఆప్షన్ కు అవకాశం కల్పిస్తారు. మొత్తం 9144 ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టుల్లో(RRB Technician Jobs) టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ 1092, టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 పోస్టులు 8,052 ఉన్నాయి. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ.500లుగా నిర్ణయించారు. అయితే అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన అనంతరం రూ.400 ఫీజు రిఫండ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ, థర్డ్ జెండర్, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ కు రూ.250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. పరీక్ష అనంతరం మొత్తం ఫీజు రిఫండ్ చేస్తారు.

వయో పరిమితి

అభ్యర్థుల వయోపరిమితి జులై 1,2024 నాటికి టెక్నీషియన్(RRB Technician Postas Age limit ) గ్రేడ్‌-1 సిగ్నల్‌ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు మించకూడదు. గ్రేడ్-3 ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు వయో పరిమితి సడలింపు ఉంటుంది. అర్హులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆర్ఆర్బీ టెక్నీషియన్‌ గ్రేడ్‌ -1 సిగ్నల్‌ పోస్టులకు స్టార్టింగ్ జీతం రూ.29,200 కాగా, గ్రేడ్‌ -3 పోస్టులకు రూ.19,990 చొప్పున చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం ఎలా?(RRB Technicians posts apply)

Step 1 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inను సందర్శించండి.

Step 2 : ఈ వెబ్ సైట్ లో అప్లై పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అంతకు ముందు రిజిస్టర్ చేసుకుంటే లాగిన్ అవ్వాలి.

Step 3 : లాగిన్ పేజ్ లో Online Application Tab పై క్లిక్ చేయండి.

Step 4 : ఇందులో టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 - గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 3 ఎంపిక చేసుకుని చేసుకోండి.

Step 5 : ఆన్ లైన్ దరఖాస్తులో అన్ని వివరాలను నమోదు చేయండి.

Step 6 : మీ ప్రాథమిక, విద్యా అర్హతలను, ఫోటో, సంతకాలతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

Step 7 : అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

Step 9 : సబ్మిట్ చేసే ముందు, మీ వివరాలను క్రాస్-చెక్ చేయండి

Step 10 : అప్లికేషన్ సబ్మిట్ చేసి,డౌన్ లోడ్ చేసుకోండి.

1:1 ఎంపిక

RRB రిక్రూట్మెంట్ లో ఖాళీలకు 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)లో అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను వివిధ షిఫ్ట్‌లలో నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ జాబితాను అధికారిక RRB వెబ్‌సైట్‌ల ఉంచుతారు. దీంతో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్ కు సమాచారం ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులను తీసివేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం