Hyderabad : మద్యం మత్తులో యువకుడు కారు డ్రైవింగ్ - ఏడేళ్ల బాలుడు మృతి, తండ్రికి గాయాలు..!-rash driving in golconda man kills child injures father ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : మద్యం మత్తులో యువకుడు కారు డ్రైవింగ్ - ఏడేళ్ల బాలుడు మృతి, తండ్రికి గాయాలు..!

Hyderabad : మద్యం మత్తులో యువకుడు కారు డ్రైవింగ్ - ఏడేళ్ల బాలుడు మృతి, తండ్రికి గాయాలు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 03, 2024 01:26 PM IST

Rash Driving Case in Hyderabad : హైదరాబాద్ లోని గోల్కొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోగా… తండ్రికి గాయాలయ్యాయి.

ప్రమాదానికి కారణమైన కారు
ప్రమాదానికి కారణమైన కారు

హైదరాబాద్‌ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది.  గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవర్ వేగంగా వెళ్లటంతో ఓ బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడేళ్ల  బాలుడు ప్రాణాలు కోల్పోగా… చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే….. గొల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసం ఉంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి తన కుమారుడిని బైక్ తీసుకొని వెళ్తున్నాడు. ఇదే టైంలో షేక్‌పేటకు చెందిన శ్రీనాథ్ అనే యువకుడు కారులో వేగంగా వచ్చి వీరి బైకును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు… ప్రాణాలు కోల్పోయాడు. తండ్రికి కూడా గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే స్థానికులు కారు డ్రైవ్ చేసిన యువకుడిని పట్టుకుని దేహాశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అతడి కారు నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అసలు కారులో ఎంతమంది ఉన్నారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫోన్ ఛార్జర్ నోట్లో పెట్టుకొని చిన్నారి మృతి

సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకుని షాక్ తో ఏడాదిన్నర బాలిక మృతి చెందింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలం కొత్త మద్దిపడగలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… కొత్తమద్దిపడగ గ్రామానికి చెందిన దుర్గం సుశీల రాజలింగు దంపతులకు ఆరాధ్య ఇరువురు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె ఆరాధ్య (08) గురువారం రాత్రి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్న సమయంలో ఆడుకుంటూ వెళ్లి చార్జింగ్ కేబుల్ ని పట్టు కొని నోట్లో పెట్టుకుంది.

ఛార్జింగ్ కేబుల్ కి స్విచ్ వేసి ఉండడంతో ఒక్కసారిగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే పాప స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే చిన్నారి ఆరాధ్యను తల్లిదండ్రులు ఇద్దరు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆరాధ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో క్షణం క్రితం వరకు తమ కళ్ల ఎదుట సందడిగా కదలాడిన తమ బిడ్డ విగతజీవిగా మారి మృతి ఒడిలోకి వెళ్లడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆసుపత్రిలో తమ కూతురిని చూసి వారు రోధించిన తీరు అక్కడున్న వారిని కలచి వేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జింగ్ కేబుల్స్, సెల్ ఫోన్లు చిన్నారులకు వీలైనంత దూరంగా ఉంచాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆరాధ్య మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Whats_app_banner