Rahul Gandhi Jodo Yatra : బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే.. కలిసే పని చేస్తున్నాయి -rahul gandhi comments on bjp and trs in bharat jodo yatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rahul Gandhi Jodo Yatra : బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే.. కలిసే పని చేస్తున్నాయి

Rahul Gandhi Jodo Yatra : బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే.. కలిసే పని చేస్తున్నాయి

HT Telugu Desk HT Telugu
Nov 02, 2022 09:27 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra : యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిన పాపం మోదీ ప్రభుత్వానిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, కలిసే పని చేస్తున్నాయని విమర్శించారు. మోదీ సర్కార్‌ విధానాలతోనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆరోపించారు.

మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్‌ జోడోయాత్ర(Bharat Jodo Yatra) తెలంగాణలో సాగుతోంది. సాయంత్రం 4 గంటలకు లింగంపల్లి చౌరస్తా నుంచి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్‌ వెళ్లింది. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. సాయంత్ర పూట రాహుల్‌గాంధీ బాలుడితో క్రికెట్‌(Cricket) ఆడటం ఆకట్టుకుంది. పటాన్‌చెరు ఆనంద్‌భవన్‌ హోటల్లో 20 నిమిషాల పాటు రాహుల్‌ రెస్ట్ తీసుకున్నారు.

అనంతరం యాత్రను మళ్లీ మెుదలుపెట్టారు. రహదారికి రెండు వైపులా ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయింది. సాయంత్రం శేరిలింగంపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర రామచంద్రాపురం, పటాన్‌చెరుల మీదుగా సంగారెడ్డి జిల్లా ముత్తంగికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

'యువతకు ఉద్యోగాల్లేకుండా చేసిన పాపం మోదీ(Modi)ది. బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) ఒక్కటే. కలిసి పనిచేస్తున్నాయి. మోదీ సర్కార్‌(Modi Govt) విధానాల వల్ల దేశంలోని అన్నివర్గాల ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ సర్కార్‌ వారి మిత్రులకు కారుచౌకగా కట్టబెడుతోంది. యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిన పాపం మోదీకే తగలుతుంది. పెట్రో ధరల పెంపుతో పేద, మధ్య తరగతి వర్గాలపై భారం పెరిగింది. నిత్యావసరాల ధరలు పెంచి వంటింట్లో మంటలు పెట్టారు.' అని రాహుల్ గాంధీ విమర్శించారు.

ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కూలదోస్తోందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. యూపీఏ(UPA) పాలనలో సిలిండర్‌ ధర రూ.400 మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. మోదీ పాలనలో సిలిండర్‌ ధర రూ.1100కు పైగా చేశారన్నారు. పెట్రోల్‌(Petrol), డీజిల్‌ ధరలను భారీగా పెంచారని విమర్శించారు. సాగు చట్టాల వేళ విపక్షాలన్నీ ఒకవైపు ఉంటే.. బీజేపీ-టీఆర్ఎస్ ఇంకోవైపు ఉన్నాయన్నారు. వందల కోట్ల ప్రజాధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra సాగుతుందని చెప్పారు.

IPL_Entry_Point