Telugu News  /  Telangana  /  Pm Modi Flags Off Secunderabad-visakhapatnam Vande Bharat Express
వందే భారత్ ఎక్స్ ప్రెస్  ప్రారంభం
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం (ANI)

Hyd - Vizag Vande Bharat Express: వందే భారత్ పరుగులు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని

15 January 2023, 11:42 ISTHT Telugu Desk
15 January 2023, 11:42 IST

Secunderabad-Visakhapatnam Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో (సికింద్రాబాద్ నుంచి విశాఖ) ప్రారంభం కానున్న వందేభారత్ రైలును ప్రధాన మంత్రి మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసైతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Vande Bharat Express in Telugu States:తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు షురూ అయ్యాయి. సంక్రాంతి గిఫ్ట్ గా ఈ రైలును... ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. సికింద్రాబాద్‌ 10వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి పరుగులు పెట్టే ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, కిషన్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ పాల్గొన్నారు. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకే ఈ వందే భారత్‌ రైలు అని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇక వేగవంతమైన ప్రయాణం కొనసాగుతుంది. వందే భారత్‌ ద్వారా విలువైన సమయం ఆదా అవుతుందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందేభారత్ రైలు సేవలందించనుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు ( ట్రైన్ నెం. 20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మొత్తం 14 ఏసీ ఛైర్‌ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి.వందే భారత్‌ రైలులో ఛైర్‌ కార్‌ ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి..

సికింద్రాబాద్ నుంచి వరంగల్ కు ఛార్జి రూ. 520

సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ. 750

సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ. 905

సికింద్రాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఛార్జి రూ. 1,365

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ. 1,665

ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ చార్జీలు... సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ. 3120 గా ఉంది.14 ఏసీ ఛైర్ కార్ కోచ్ లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ లు కలిపి మొత్తం 16 కోచ్ లతో కూడిన రైలులో 1,128 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందేభారత్ రైలు సేవలందిస్తుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు ( ట్రైన్ నెం. 20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు.. రాత్రి 11.30 గంటలకు... అంటే కేవలం ఎనిమిదిన్నర గంటల్లో విశాఖ చేరుకుంటుంది.