Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్-plantix app used by 3 crore farmers across the world ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

HT Telugu Desk HT Telugu
May 06, 2024 02:05 PM IST

Plantix App: పఠాన్ చెరువులో ఉన్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ తయారు చేసిన ప్లాంటిక్స్ మొబైల్ యాప్ ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నమూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్నారని, ఇక్రిశాట్ ప్రకటించింది.

రైతుల మన్నన పొందుతున్న ప్లాంటిక్స్ యాప్
రైతుల మన్నన పొందుతున్న ప్లాంటిక్స్ యాప్

Plantix App: పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్లను, క్రిమి కీటకాలాను గుర్తించడంలో, ఈ మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

yearly horoscope entry point

మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ఇప్పటివరకు 60 రకాల పంటలకు సంబందించిన 10 కోట్ల ఫోటోలను ప్లాంటిక్స్ యాప్ లోకి అప్లోడ్ చేయగా, వాటిని విశ్లేషించి, సుమారుగా 700 రకాల తెగుళ్లను, క్రిమికీటకాలు ప్లాంటిక్స్ యాప్ గుర్తించందని శాస్త్రవేత్తలు తెలిపారు.

రైతులు సులువుగా అర్ధం చేసుకోవడానికి, వారి వారి భాషలోనే సమాచారం ఇచ్చేవిధంగా ఈ యాప్ ని అభివృద్ధి చేసారు ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు.

20 భాషల్లో సమాచారం ఇస్తున్న ప్లాంటిక్స్…

ప్రపంచవ్యాప్తంగా, అత్యంత ప్రాచుర్యంలో ఉన్న 20 భాషల్లో ప్లాంటిక్స్ యాప్ తన సేవలను అందిస్తుంది. పదేండ్ల కింద తయారు చేసిన ఈ యాప్ యొక్క వాడకం ఇటీవల బాగా పెరిగింది. సామాన్య రైతులలో కూడా మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరగడంతో రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారనే దానికి నిదర్శనం ఈ మార్పు.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, ఈ మొక్కకు, ఆ తెగులును, క్రిమికీటకాలు ఎలాంటి మందులు వాడాలని ప్లాంటిక్స్ యాప్ రైతులకు సూచిస్తుందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తెలిపారు.

రైతుల్లో మొబైల్ వాడకం పెరిగింది…

టెక్నాలజీ ని ఉపయోగిస్తూ రైతులకు యాజమాన్య పద్ధతుల పైన సులువుగా సలహాలాలు ఇవ్వటమే ఇక్రిశాట్ లక్షమని, ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ హ్యూస్ తెలిపారు. టెక్నాలజీ వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో, రైతులు అందరు కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడుతున్నారని, దానివలన ప్లాంటిక్స్ వినియోగం పెరిగిందని ఆమె తెలిపారు.

ప్లాంటిక్స్ వల్ల ఉపయోగం ఉండటం వలెనే, రైతులు ఆ మొబైల్ యాప్ ని విరివిగా వాడుతున్నారని ఆమె అన్నారు. రైతులకు ఇప్పుడు ప్లాంటిక్స్ తో అందించే సేవలను కూడా పెంచాలని ఆ సంస్థ యోచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా, మారుమూల గ్రామాల్లాలో కూడా చిన్న చిన్న కమతాల్లో పంటలు పండిస్తున్న రైతులు కూడా ఈ యాప్ ద్వారా లబ్ది పొందుతున్నారని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.

ప్లాంటిక్స్ ద్వారా సేవలు విస్తరిస్తాం....

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్లాంటిక్స్ యాప్ సిమోన్ స్త్రే మాట్లాడుతూ ప్లాంటిక్స్ ప్రయాణంలో ఎందరో పాత్ర ఉన్నదని అయన కొనియాడారు. పది సంవత్సరాలు పూర్తీ చేసుకున్న సందర్బంగా, తాము ఆ యాప్ ని రైతులకు మరింత ఉపయోగపడే విధంగా ముందడుగు వేస్తున్నామని అయన ప్రకటించారు.

రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగల సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని సిమోన్ తెలిపారు. ఈ సందర్బంగా ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, ప్లాంటిక్స్ సాధించిన పురోగతి పైన ఒక బ్రోచర్ విడుదల చేసారు. ప్లాంటిక్స్ అబివృద్ధి లో సహకరించిన సంస్థలకు, ఉద్యోగాలకు సిమోన్ కృతజ్ఞతలు తెలిపారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి0

Whats_app_banner