TS Gurukulam Jobs : 9,231 గురుకుల ఉద్యోగాలు.. ఇవాళ్టి నుంచే OTR ప్రాసెస్, లింక్ ఇదే...
TREIRB Recruitment OTR: గురుకులాల ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ షురూ అయింది. పలు సొసైటీ పరిధిలో ఖాళీగా మొత్తం 9231 పోస్లుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం నుంచి ఓటీఆర్ ప్రాసెస్ ప్రారంభమైంది.
Telangana Gurukulam Notification 2023 Updates: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9,231 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఇవాళ్టి నుంచి ఓటీఆర్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఇక కేటగిరీలవారీగా దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులకే వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
TSPSC తరహాలోనే...
టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ఓటీఆర్ విజయవంతమైంది. ఒక్కసారి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఓటీఆర్ ఎంట్రీ చేస్తే సులభంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటో, సంతకం, విద్యార్హతలు వంటివి వివరాలను ప్రతిసారి నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా దరఖాస్తు ప్రక్రియ సింపుల్ గా పూర్తి అవుతుంది. ఈ తరహాలోనే గురుకులాల ఉద్యోగాల భర్తీలోనూ ఓటీఆర్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఎన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్నా.. వ్యక్తిగత వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.
భర్తీ చేసే పోస్టుల వివరాలు :
జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ - 2008
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ - 868
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) -1276
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) 4090
లైబ్రేరియన్ స్కూల్- 434
పీజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ - 275
డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ -134
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్- 92
మ్యూజిక్ టీచర్స్- 124
https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత… భారీ సంఖ్యలో గురుకులాలను పెంచింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మూడేళ్ల క్రితమే ఆయా గురుకులాల్లో 10 వేల పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో 3వేల పోస్టులను కూడా భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. త్వరలోనే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం