Medchal Malkajgiri: జవహర్‌నగర్‌లో నెగ్గిన అవిశ్వాస తీర్మానం..మేయర్‌పై కార్పొరేటర్ల తిరుగుబాటు…
Medchal Malkajgiri: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ మున్సిపల్ Municipal Corporation కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యMekala Sravya పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది.
Medchal Malkajgiri: జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మేయర్ పదవిని కోల్పోయారు. గత నెల రోజులుగా క్యాంపుకు వెళ్లిన అసమ్మతి కార్పొరేటర్లు సోమవారం నేరుగా బస్సుల్లో వచ్చి అవిశ్వాస No Confidence పరీక్షల్లో పాల్గొన్నారు.
రిటర్నింగ్ అధికారి వెంకట ఉపేందర్ రెడ్డి సమక్షంలో ఈ అవిశ్వాస పరీక్షను చేపట్టారు. జవహర్ నగర్ Jawahar Nagar మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉండగా రెండేళ్ల క్రితం 16వ డివిజన్ కార్పొరేటర్ ఆరోగ్యంతో మృతి చెందారు. మగిలిన 27 మందిలో 20 మంది కార్పొరేటర్లు మేయర్ మేకల కావ్య పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు.
సోమవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన పత్రాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. మరో వారం రోజుల్లో కొత్త మేయర్ ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నూతన మేయర్ ఎవరు...?
జవహర్ నగర్ లో మొత్తం 19 మంది కార్పొరేటర్లు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. 28వ డివిజన్ కార్పొరేటర్ నిహారిక గౌడ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 18వ డివిజన్ కార్పొరేటర్ దొంతగాని శాంతి గౌడ్ అవిశ్వాస పత్రాన్ని నెల రోజుల క్రితమే జిల్లా కలెక్టర్కు అందజేసి 19 మందితో కలిసి క్యాంప్ రాజకీయాలు చేశారు.
సోమవారం ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో నిహారిక గౌడ్ సైతం పాల్గొన్నారు. అయితే డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు మేయర్‌గా శాంతి గౌడ్‌కు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అవిశ్వాస అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సోమవారం తన బలగాన్ని పెద్ద ఎత్తున తరలించి అవిశ్వాసాన్ని బలపరిచేలా ప్రయత్నించారు. మేయర్ పీఠంపై బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాకుండా 18వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ నిహారిక గౌడ్‌ను కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బిఅర్ఎస్ కార్పొరేటర్ల మద్దతు కోరుతున్నట్లు సమాచారం.
అభివృద్ధి చేసినందుకే అవిశ్వాసమా ? మేకల కావ్య
మరోవైపు గడిచిన నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి చేశానని అదే తాను చేసిన తప్పా అని మాజీ మేయర్ మేకల కావ్య ప్రశ్నించారు. అభివృద్ధి చేసినందుకే తనపై అవిశ్వాసం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం అవిశ్వాసం నెగ్గిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై అవినీతి ఆరోపణలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
డిప్యూటీ మేయర్ పై ఇప్పటికే 15 క్రిమినల్ కేసులు ఉన్నాయని, కార్పొరేటర్ శాంతి కు కలెక్టర్ షో కాజ్ నోటీసు జారీ చేశారని గుర్తు చేశారు.కేవలం డబ్బు కోసమే కార్పొరేటర్లు క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు అని ఆమె ఆరోపించారు. అవిశ్వాసం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)