Rythu Bandhu 2023: కొత్తగా పాస్ బుక్ వచ్చిందా? 'రైతుబంధు'కు అప్లయ్ చేసుకోండి - ప్రాసెస్ ఇదే-new applications are being accepted for rythu bandhu scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu 2023: కొత్తగా పాస్ బుక్ వచ్చిందా? 'రైతుబంధు'కు అప్లయ్ చేసుకోండి - ప్రాసెస్ ఇదే

Rythu Bandhu 2023: కొత్తగా పాస్ బుక్ వచ్చిందా? 'రైతుబంధు'కు అప్లయ్ చేసుకోండి - ప్రాసెస్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 22, 2023 01:56 PM IST

Rythu Bandhu scheme Updates: రైతుబంధుకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది వ్యవసాయశాఖ. ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు రాని వారు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

రైతుబంధు స్కీమ్
రైతుబంధు స్కీమ్

Rythu Bandhu scheme 2023: వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులకు ఎప్పటిలాగే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇదిలా ఉంటే... ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు రానివారికి గుడ్ న్యూస్ చెప్పింది వ్యవసాయ శాఖ. కొత్తగా దరఖాస్తులు స్వీరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది.

కొత్తగా పట్టాదార్‌ పాస్‌ బుక్‌ వచ్చిన రైతులకు ఈ వానాకాలం సీజన్‌లో రైతుబంధుకు అవకాశం కల్పించింది వ్యవసాయ శాఖ. జూన్‌ 16 నాటికి పాస్‌ బుక్‌ వచ్చిన ప్రతీ రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందిచనుంది. ఈ పథకం కింద సాయం పొందడానికి కొత్త పట్టాదారు పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులకు మొదటగా డబ్బులు జమ అయిన తర్వాత…. కొత్తవారికి ఆ తర్వాత జమ చేయనున్నారు. సీసీఎల్‌ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తించి…. రైతబంధు నిధులను ఇవ్వనున్నారు.

బ్యాంక్ అకౌంట్ మార్చుకోవచ్చు…

బ్యాంక్ ఖాతాల మార్చుకోవాలనుకునే వారికి కూడా కీలక అప్డేట్ ఇచ్చింది వ్యవసాయశాఖ. ఇందుకు సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది.

-వానాకాలం -2023 రైతు బంధు గూర్చి ఎవరైనా లోన్ అకౌంట్ లేదా ఇతర కారణాలు కలిగి అకౌంట్ మార్చుకోవడానికి జూన్ 21 సాయంత్రం వరకు అవకాశం కలదు.

- అకౌంట్ మార్చుకునే రైతులు తమ కొత్త అకౌంట్ పాస్ బుక్ జీరాక్స్ లను స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.

-రైతుబంధు కొత్త రైతుల దరఖాస్తు - చివరి తేదీల వివరాలను వ్యవసాయశాఖ నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తేలియజేయనున్నారు.

- జూన్ 26 వ తారీఖు నుండి గతంలో రైతు బంధు అందుకున్న రైతులకు రైతు బంధు నిధులు జమ కావడం ప్రారంభం అవుతాయి.

- కొత్త రైతులకు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ వివరాలు నమోదు చేసిన తదుపరి చివరిలో జమ అవుతాయి.

రైతు బంధు పథకం కింద ప్రతీ ఎకరానికి వానాకాలం, యాసంగి సీజన్లో రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సీజన్‌లో కూడా ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనుంది సర్కార్. వారికి కూడా ఇదే ఏడాది నుంచే రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పోడు భూముల పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించనుంది. సంబంధిత రైతు బ్యాంకు ఖాతా నంబర్‌, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, లబ్ధిదారుడి మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలను అప్‌లోడ్‌ చే సేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది పోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచేపనిలో పడ్డారు.

IPL_Entry_Point