PGCIL Recruitment 2024 : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - ఏపీ, తెలంగాణలో ఖాళీలు-jobs notification for power grid corporation 2024 vacancies in ap and telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pgcil Recruitment 2024 : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - ఏపీ, తెలంగాణలో ఖాళీలు

PGCIL Recruitment 2024 : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - ఏపీ, తెలంగాణలో ఖాళీలు

HT Telugu Desk HT Telugu
Nov 01, 2024 03:24 PM IST

PGCIL Recruitment: ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా… ఏపీ, తెలంగాణలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు న‌వంబ‌ర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://www.powergrid.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.

పవన్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు
పవన్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. దర‌ఖాస్తు దాఖ‌లకు న‌వంబ‌ర్ 12 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న‌వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాలి.

ట్రైనింగ్ ఇచ్చి సొంత రాష్ట్రంలో ప‌ని చేసేందుకు ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్‌) నుండి డిప్లొమా ట్రైనీ ఎల‌క్ట్రిక‌ల్ (డీటీఈ), డిప్లొమా ట్రైనీ సివిల్ (డీటీసీ), జూనియ‌ర్ ఆఫీస‌ర్ ట్రైనీ (హెచ్ఆర్‌) ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా మొత్తం 802 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

ఇందులో స‌ద‌ర‌న్ రీజియ‌న్ (ఎస్ఆర్‌-I) కింద‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క (ఒక పార్టు) ఉన్నాయి. ఈ రీజియ‌న్‌లో మొత్తం 72 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో 29 అన్ రిజర్డ్వ్ కేట‌గిరి, 5- ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరి, 21- ఓబీసీ కేట‌గిరి, 12-ఎస్సీ కేట‌గిరి, 5-ఎస్టీ కేట‌గిరి, 3-దివ్యాంగు కేట‌గిరి, 6-ఎక్స్ స‌ర్వీస్ మ్యాన్‌, 2-డీఈఎక్స్ స‌ర్వీస్ మ్యాన్ పోస్టులు ఉన్నాయి.

ఎస్ఆర్‌-Iలో డిప్లొమా ట్రైనీ ఎల‌క్ట్రిక‌ల్ (డీటీఈ)-63, డిప్లొమా ట్రైనీ సివిల్ (డీటీసీ)-4, జూనియ‌ర్ ఆఫీస‌ర్ ట్రైనీ (హెచ్ఆర్‌)-5 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. డీటీఈలో అన్ రిజ‌ర్డ్వ్-25, ఈడబ్ల్యూఎస్‌-5, ఓబీసీ-18, ఎస్సీ-11, ఎస్టీ-4, దివ్యాంగు-2, ఎక్స్ స‌ర్వీస్ మ్యాన్‌-5, డీఈఎక్స్ స‌ర్వీస్ మ్యాన్‌-2 పోస్టులు ఉన్నాయి. అలాగే డీటీసీలో అన్ రిజర్డ్వ్‌-2, ఓబీసీ-1, ఎస్సీ -1, జేఓటీ (హెచ్ఆర్‌)లో అన్ రిజ‌ర్డ్వ్ -2, ఓబీసీ-2, ఎస్టీ-1 పోస్టులు ఉన్నాయి.

అర్హ‌త‌లు:

  • డీటీఈ పోస్టు - ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ ప‌వ‌ర్, ఎల‌క్ట్రానిక్స్‌, వ‌ప‌ర్ సిస్ట‌మ్ ఇంజ‌నీరింగ్‌, ప‌వ‌ర్ ఇంజ‌నీరంగ్ (ఎల‌క్ట్రిక‌ల్‌)లలో మూడేళ్ల రెగ్యూల‌ర్ డిప్లొమా పూర్తి చేయాలి. ఓబీసీ, జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు 70 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు పాస్ మార్కులు వ‌స్తే స‌రిపోతుంది. డిప్లొమా లేకుండా బీటెక్‌, బీఈ, ఎంటెక్‌, ఎంఈ వంటి ఉన్న‌త విద్యా ఉన్న‌ప్ప‌టికీ ప‌నికి రాదు.
  • డీటీసీ పోస్టు - సివిల్ ఇంజ‌నీరింగ్‌లో మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఓబీసీ, జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు 70 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు పాస్ మార్కులు వ‌స్తే స‌రిపోతుంది. డిప్లొమా లేకుండా బీటెక్‌, బీఈ, ఎంటెక్‌, ఎంఈ వంటి ఉన్న‌త విద్యా ఉన్న‌ప్ప‌టికీ ప‌నికి రాదు.
  • జేఓటీ (హెచ్ఆర్‌) - బీబీఏ, బీబీఎం, బీబీఎస్‌ల‌తో పాటు వాటికి స‌మాన‌మైన కోర్సుల్లో మూడేళ్ల రెగ్యూల‌ర్ గ్రాడ్యూష‌న్ డిగ్రీ పూర్తి చేయాలి. ఓబీసీ, జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు పాస్ మార్కులు వ‌స్తే స‌రిపోతుంది. డిగ్రీ లేకుండా పోస్టు గ్రాడ్యూష‌న్‌, డిప్లొమా లేదా స‌మాన‌మైన విద్యా అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ, ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అన‌ర్హులు.

2024 న‌వంబ‌ర్ 12 నాటికి 27 సంవ‌త్స‌రాలు పూర్తి అయి ఉండాలి. అలాగే ఓబీసీ అభ్య‌ర్థులు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులకు ఐదేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు, ఎక్స్ స‌ర్వీస్ మ్యాన్‌ల‌కు మూడేళ్లు, అల్ల‌ర్ల‌లో బాధితుల‌కు ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంటే, బేసిక్ పే స్కేల్ రూ.24,000 ఉంటుంది. అలాగే డీఏతో పాటు ఇత‌ర అలివెన్సులు ఉంటాయి. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలన్నీ వ‌ర్తిస్తాయి. ట్రైనింగ్ పూర్తి అయిన త‌రువాత మూడేళ్లు త‌ప్ప‌ని స‌రిగా ప‌ని చేయాల్సి వ‌స్తుంది.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు రూ.300 ఉంది. అప్లికేష‌న్ ఫీజును ఆన్‌లైన్‌లో ఈ డైరెక్ట్ లింక్‌ను https://www.powergrid.in/online-payment-application-fees క్లిక్ చేసి చెల్లించాలి. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను https://www.powergrid.in/ సంద‌ర్శించాలి.

అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. డీటీఈ, డీటీసీ పోస్టుల‌కు కంప్యూట‌ర్ బేసిడ్ రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. జెఓటీ (హెచ్ఆర్‌) పోస్టుల‌కు కంప్యూట‌ర్ బేసిడ్ రాత ప‌రీక్ష‌తో పాటు కంప్యూట‌ర్ సిల్క్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. 170 ప్ర‌శ్న‌ల‌ను ఉంటాయి. అందులో పార్ట్‌-Iలో 120 ప్ర‌శ్న‌లు (టెక్నిక‌ల్ నాలెడ్జ్‌, ప్రొఫెస‌న‌ల్ నాలెడ్జ్‌), పార్ట్‌-IIలో 50 ప్ర‌శ్న‌లు (ఇంగ్లీష్ ఒక‌బ్ల‌రీ, వెర్బ‌ల్ కాంప్ర‌హెన్సన్‌, క్వాంట‌టివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్ అబిలిటీ త‌దిత‌ర అంశాలు) ఉంటాయి. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌ లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం