ISRO NRSC Hyderabad Jobs 2024 : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో 71 కొలువులు - ముఖ్య తేదీలివే-isro nrsc hyderabad recruitment notification 2024 to fill 71 jobs check the key details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Isro Nrsc Hyderabad Jobs 2024 : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో 71 కొలువులు - ముఖ్య తేదీలివే

ISRO NRSC Hyderabad Jobs 2024 : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో 71 కొలువులు - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 21, 2024 02:47 PM IST

ISRO NRSC Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 4వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తి కానుంది.

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలు (https://www.nrsc.gov.in/)

NRSC Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(National Remote Sensing Centre) లో పలు ఉద్యోగాల(Recruitment) భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 71 కొలువులను భర్తీ చేయనున్నారు. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ప్రక్రియ మార్చి 18వ తేదీతో ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియనుంది. https://www.nrsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన -నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NSRC), హైదరాబాద్

ఉద్యోగ ఖాళీలు - 71

ఖాళీల వివరాలు - రిసెర్చ్ సైంటిస్ట్ - 20, జూనియర్ రిసెర్చ్ ఫెలో 27, ప్రాజెక్ట్ సైంటిస్ట్-I - 06, ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి - 04 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్-I 02, ప్రాజెక్ట్ అసోసియేట్-II - 12 ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు.

పోస్టులను బట్టి అర్హతలను పేర్కొన్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు. వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

రాతపరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్వూలు కూడా ఉంటాయి. కొన్ని పోస్టులకు రాత పరీక్షలు లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూకి పిలుస్తారు.

దరఖాస్తులు - ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 18, 2024.

దరఖాస్తులకు చివరి తేదీ: 08 ఏప్రిల్ 2024(సాయంత్రం 5 గంటల లోపు పంపాలి)

అధికారిక వెబ్ సైట్ - https://www.nrsc.gov.in/

ఆన్ లైన్ దరఖాస్తు లింక్ - https://apps.nrsc.gov.in/eRecruitment_NRSC/

IIT Tirupati Recruitment 2024: నాన్ టీచింగ్ ఖాళీల భర్తీ కోసం తిరుపతిలోని ఐఐటీ(IIT Tirupati Recruitment 2) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి 12వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఏప్రిల్ 11వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియనుంది. ఆన్ లైన్ లో దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టును బట్టి జీతభత్యాలను ఖరారు చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - ఐఐటీ, తిరుపతి.

మొత్తం ఉద్యోగాలు - 08

ఖాళీల వివరాలు :

జూనియర్‌ అసిస్టెంట్‌ - 03(Group C)

స్టూడెంట్‌ కౌన్సెలర్‌ - 01(Group A)

హిందీ ట్రాన్స్‌లేటర్‌ - 01(Group B)

జూనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ - 1 ఉద్యోగం(Group B)

జూనియర్‌ టెక్నీషియన్‌ - 02 పోస్టులు(Group C)

అర్హతలు - మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ ఉండాలి. పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.

గ్రూప్ ఏ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వూ ఉంటుంది.గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి అబ్జెక్టివ్ బేస్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఉంటుంది.

దరఖాస్తుల విధానం - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 12, 2024

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - 11 ఏప్రిల్, 2024.

అధికారిక వెబ్ సైట్ - https://iittp.ac.in/

అప్లికేషన్ లింక్ - https://iittp.plumerp.co.in/prod/iittirupati/staffrecruitment

Whats_app_banner