IRCTC Andaman Tour : హైదరాబాద్ టు అండమాన్... తక్కువ ధరలోనే 6 రోజుల ట్రిప్ - వివరాలివే-irctc tourism latest andaman tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Andaman Tour : హైదరాబాద్ టు అండమాన్... తక్కువ ధరలోనే 6 రోజుల ట్రిప్ - వివరాలివే

IRCTC Andaman Tour : హైదరాబాద్ టు అండమాన్... తక్కువ ధరలోనే 6 రోజుల ట్రిప్ - వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 24, 2023 01:05 PM IST

Hyderabad - Andaman Tour: అండమాన్ దీవుల్లోకి వెళ్లాలనిపిస్తుందా? అందమైన బీచ్‌లతో ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులను చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ సరికొత్త ప్యాకేజీ అందిస్తోంది. డేట్స్ తో పాటు ధరలను పేర్కొంది. ఆరు రోజుల టూర్ ప్యాకేజీ వివరాలను ఇక్కడ చూడండి…..

www.irctctourism.com
www.irctctourism.com (www.irctctourism.com)

IRCTC Hyderabad To Andaman Tour : దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇందులో భాగంగానే అండమాన్ దీవులను చూడాలనుకునే వారి కోసం ఓ ప్యాకేజీ ప్రకటించింది. AMAZING ANDAMAN EX HYDERABAD పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. HAVELOCK, PORT BLAIR, వివిధ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఫ్లైట్లో తీసుకెళ్తారు. ప్రస్తుతం ఈ టూర్ ఆగస్టు 18, 2023 తేదీన అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ఉంటుంది.

Day 1:- హైదరాబాద్ - పోర్ట్ బ్లెయిర్

హైదరాబాద్ విమానాశ్రయం ఉదయం 04.35 గంటలకు బయల్దేరుతారు. 09.15 గంటల వరకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. లైట్, సౌండ్ షో చూడొచ్చు. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది.

Day 2:- Ross & North Bay Island Tour

హోటల్ లో అల్పాహారం చేసి.. రాస్ ఐలాండ్ బయలుదేరుతారు. తర్వాత నార్త్ బే సందర్శన ఉంటుంది. భోజనం తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.రాత్రి ఫోర్ట్ బ్లెయిర్ లోనే బస చేస్తారు.

Day 3:- Port Blair – Havelock Island

రెండో రోజు హావ్‌లాక్ కు వెళ్తారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... రాధానగర్ బీచ్ చూస్తారు. రాత్రి హావ్‌లాక్ లోనే బస చేస్తారు.

Day 4:- Havelock Island - Neil Island

హోటల్ లో అల్పాహారం చేసి.. చెక్ అవుట్ చేయాలి. తర్వాత కాలాపత్తర్ బీచ్ సందర్శిస్తారు. నీల్ ద్వీపం కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాలి. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్‌కు వెళ్లి చెక్ ఇన్ చేయాలి. రిఫ్రెష్ అయిన తర్వాత సహజ వంతెన, లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ద్వీపంలోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది.

Day 5:- Neil Island - Port Blair

ఉదయాన్నే భరత్‌పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని ఆస్వాదించొచ్చు. అల్పాహారం ముగించుకుని హోటల్ నుండి చెక్ అవుట్ చేయాలి. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. విశ్రాంతి, షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు.

Day 6: Departure from Port Blair

హోటల్ లో అల్పాహారం చేసి చెక్అవుట్ చేయాలి. 07:55 గంటలకు హైదరాబాద్ వెళ్లే విమానం ఉంటుంది. 12:10 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలు:

అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.58440గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.45830కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.45540గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Whats_app_banner