IRCTC Tour Package: కరీంనగర్ నుంచి తిరుమల టూర్.. ధర, చూసే ప్రాంతాలివే-irctc tourism announced tirupati kanipakam tour from karimnagar city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tour Package: కరీంనగర్ నుంచి తిరుమల టూర్.. ధర, చూసే ప్రాంతాలివే

IRCTC Tour Package: కరీంనగర్ నుంచి తిరుమల టూర్.. ధర, చూసే ప్రాంతాలివే

Mahendra Maheshwaram HT Telugu
Sep 26, 2022 03:50 PM IST

IRCTC Tour Package From Karimnagar: కరీంనగర్ నుంచి SAPTHAGIRI పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

<p>కరీంనగర్ తిరుమల టూర్</p>
కరీంనగర్ తిరుమల టూర్ (www.irctctourism.com)

irctc tourism announced tour package from karimnagar: వేర్వేరు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా కరీంనగర్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SAPTHAGIRI' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌లో కాణిపాకం, తిరుచానూరు, తిరుమల, తిరుపతి ప్రాంతాలు కవర్ అవుతాయి.

karimnagar tirumala tour: అక్టోబర్ 6వ తేదీ నుంచి ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి గురువారం ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 1: కరీంనగర్ నుంచి (Train No. 12762) రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది. పెద్దపల్లి స్టేషన్ వద్ద ఎక్కేవారు రాత్రి 8.05 నిమిషాలకు, వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం వద్ద 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి మొత్తం జర్నీలో ఉంటారు.

Day 2: ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. ఫ్రెష్ అప్ అవుతారు. అక్కడ్నుంచి శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం శ్రీకాళహస్తీ, తిరుచానూరు ఆలయాలకు వెళ్తారు. తిరిగి హోటల్ కు చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.

Day 3: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత..హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఉదయం 08.30 గంటలకు తిరుమల చేరుకుంటారు. ప్రత్యేక దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.15 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.

Day 4: తెల్లవారుజామున ఉదయం 03.26 గంటలకు ఖమ్మం, 04.41 గంటలకు వరంగల్, 05.55 గంటలకు పెద్దపల్లి, ఉదయం 08.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ఛార్జీలివే..

sapthagiri tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 7,990 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 6,940 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.6,800 గా ఉంది. కంఫ్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.

<p>ధరల వివరాలు</p>
ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

Whats_app_banner