Telangana Court Jobs 2024 : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(Telangana Judicial Services) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లా జడ్జీల (ఎంట్రీ లెవెల్) పోస్టులను భర్తీ చేయనుంది. మే14వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్ 13వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అర్హులైన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://tshc.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
Telangana High Court Recruitment 2024 : మరోవైపు సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కొద్దిరోజుల కిందటే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 17వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://tshc.gov.in/getRecruitDetails వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.