Son Killed Father: గంజాయి మత్తులో ఘోరం.. తండ్రిపై పోసి నిప్పంటించి… ఆపై రాయితో మోది దారుణ హత్య..
Son Killed Father: హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన తనయుడు తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడు. చెడు అలవాట్లు మానేయాలన్నందుకు తరచూ తండ్రితో ఘర్షణ పడుతూ చివరకు కిరాతకంగా హత్య చేశాడు.
Son Killed Father: హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. మాదకద్రవ్యాల Drug Addiction వినియోగానికి అలవాటు పడిన తనయుడు ఏకంగా తండ్రినే హతమార్చాడు. చిన్న వయసులోనే గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసగా మారిన తనయుడు చివరకు కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై తలపై రాయితో మోదీ హత్య చేశాడు. హైదరాబాద్ శివార్లలోని ఆదిభట్ల Adibhatla పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ ప్రాంతంలో గురువారం జరిగింది.
పోలీసులు, బాధితులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన తిరుపాటి రవిందర్ ravinder నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో చాలా కాలం క్రితం స్థిరపడ్డాడు. నగరంలో స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్నాడు.రవిందర్ మొదటి భార్య చనిపోవడంతో సుధ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
రవిందర్ మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.వారిలో పెద్ద కొడుకు చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. చిన్నకొడుకు విదేశాల్లో స్థిరపడ్డాడు. రవిందర్ రెండో భార్య సుధతో కలిసి ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
రెండు నెలల క్రితం తుర్కయంజాల్‌లోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. రవీందర్ సుధ దంపతులకు అనురాగ్ Anurag, అభిషేక్ సంతానం ఉన్ఇనారు. పెద్దకొడుకు అనురాగ్ ఖాళీగా ఉంటున్నాడు. చిన్న వయసులోనే గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. చుట్టుపక్కల అందరితో గొడవలు పడేవాడు.
డ్రగ్ ఎడిక్షన్ మాన్పించడానికి రీహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించి చికిత్స చేయించినా మార్పురాలేదని తల్లి తెలిపింది. ఇప్పటికే అతనిపై రెండు పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో జైలు శిక్ష అనుభవించాడు.
తల్లిదండ్రులతో తరచూ గొడవ పడుతున్న అనురాగ్ మూడు రోజుల క్రితం పెట్రోలు సీసాను ఇంటికి తెచ్చాడు. పెట్రోల్ ఎందుకు తెచ్చావని ప్రశ్నిస్తే ద్విచక్ర వాహనంలో పోయడానికని బదులిచ్చాడు. గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో పాటు అనురాగ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.
మధ్యాహ్నం తల్లి పడకగదిలో ఉండగా బయట నుంచి తాళం పెట్టిన అనురాగ్.. తండ్రి రవిందర్‌తో గొడవకు దిగాడు. ఇంట్లో దాచి ఉంచిన పెట్రోలును తండ్రిపై పోసేందుకు ప్రయత్నించడంతో తప్పించుకున్న తండ్రి.. భయంతో రోడ్డు మీదకు పరుగులు తీశాడు.
తండ్రిని వెంబడించి ఇంటికి కొద్ది దూరంలోనే పట్టుకుని ఒంటిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత మంటల్లో కాలిపోతున్న రవిందర్‌ను బండరాయితో తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన చూసిన స్థానికులు భీతావహులయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు రవిందర్ భార్య సుధ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రవీందర్ చిన్న కుమారుడు అభిషేక్ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. పెద్ద కుమారుడు అనురాగ్ డిగ్రీ పూర్తి చేసినా కొన్నేళ్లుగాఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. తరచూ గొడవలతో పోలీస్ స్టేషన్లకు ఎక్కాల్సి వస్తోందని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటు పడటంతో తరచూ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. పనీపాటా లేకుండా తిరుగుతున్నారంటూ అనురాగ్‌ను స్నేహితుల ముందు తిట్టడంతో అనురాగ్ కక్ష పెంచుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.