Hyderabad Wines Bandh : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ నెల 25న వైన్ షాపులు బంద్-hyderabad wine shops remain closed on march 25th due to holi festival ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Wines Bandh : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ నెల 25న వైన్ షాపులు బంద్

Hyderabad Wines Bandh : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ నెల 25న వైన్ షాపులు బంద్

Bandaru Satyaprasad HT Telugu
Mar 23, 2024 03:08 PM IST

Hyderabad Wines Bandh : మందుబాబుకు తెలంగాణ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. హోలీ సందర్భంగా ఈ నెల 25న మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

25న వైన్ షాపులు బంద్
25న వైన్ షాపులు బంద్ (Image Credit- Pexels)

Hyderabad Wines Bandh : హైదరాబాద్ లో హోలీ పండుగ(Holi Festival)అంటే పెద్ద సంబరం. హోలీ రోజున రంగులు జల్లుకుంటూ చిన్నా పెద్ద అంటూ తేడా లేకుండా వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈ ఆనందానికి కొందరు కిక్కును జోడిస్తుంటారు. అయితే మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెల 25న హోలీ పండుగ నాడు మద్యం షాపులు బంద్(Wines Bandh) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ, అబ్కారీ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

yearly horoscope entry point

వైన్స్ బంద్

హోలీ పండుగ రోజున హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు(Liquor Shops), బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్(Hyderabad Commissionerate), సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, కల్లు దుకాణాలు బంద్ చేసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో బార్స్, స్టార్ హోటళ్లు, రిజిస్ట్రర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. హోలీ వేడుకల్లో రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, బైక్‌లపై తిరుగుతూ న్యూసెన్స్ చేయడం, రోడ్లపై ఇతరులపై రంగులు పూయడం, రోడ్లపై హోలీ వేడుకలు(Hyderabad Holi Celebrations) చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా హోలీ పండుగ నాడు మందుషాపులు(Wines close) మూసివేయాలని నిర్వాహకులకు ఆదేశాలను జారీ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఎవరైనా మద్యం తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు దిగితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, మద్యంషాపుల నిర్వాహకులు సహకరించాలని పోలీసులు కోరారు.

22 లక్షల మద్యం చోరీ

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా టేకులపల్లిలో మూడు మద్యం దుకాణాలపై(Liquor Shops) ఇటీవల ప్రజలు మూకుమ్మడిగా దాడి చేశారు. బ్రాండెడ్ మద్యం బెల్డ్ షాపులకు తరలిస్తున్నారని, అధిక ధరలకు మందు అమ్ముతున్నారని ఆరోపిస్తూ స్థానికులు మద్యం దుకాణాలపై దాడి చేశారు. మొత్తం రూ.22 లక్షల విలువ చేసే మద్యాన్ని చోరీ చేశారు. టేకులపల్లి నుంచి బోడు మార్గంలో నాలుగు మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే గత కొద్దిరోజుల వ్యాపారులు కుమ్మక్కై ఎమ్మార్పీ కంటే రూ. 20-రూ.30 ఎక్కువగా అమ్ముకున్నారు. ఇదేంటని అడిగితే వేరేచోట కొనుక్కోమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. బ్రాండెడ్​మద్యాన్ని బెల్ట్​షాపులకు సరఫరా చేసి, ఎక్కువ ధరకు అమ్మకుంటున్నారు. దీంతో రెగ్యులర్ వచ్చే వారికి నచ్చిన బ్రాండ్ లు దొరకడంలేదు. గత బుధవారం ఇదే విషయంపై ప్రశ్నించేందుకు పెద్ద ఎత్తున మందుబాబులు అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకులు తీరు మారకపోవడంతో ఒక్కసారి మూడు షాపులపై దాడి చేసి రూ. 22 లక్షల మద్యం ఎత్తుకెళ్లారు. అయితే మద్యం ఎత్తుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Social Media Viral) అయ్యాయి. మహిళలు సైతం మందుసీసాలకు ఎగబడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం