Holi Skin Care : హోలీ రంగుల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు చిట్కాలు
Holi Skin Care Tips : హోలీ భారతదేశంలో గొప్పగా జరిపే పండుగ. హోలీ ఆటతో చర్మం పాడవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
రంగుల పండుగ హోలీ. హోలీ సమయంలో రంగులు చల్లుకుంటూ ఉంటారు. అయితే రంగులతో చర్మం మీద కచ్చితంగా ప్రభావం ఉంటుంది. చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే చర్మ సంరక్షణను అనుసరించాలి. హానికరమైన కలర్ పౌడర్ల వల్ల కలిగే చర్మ సమస్యలను నివారించడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. హోలీ పండుగ కొందరికి ఇబ్బందికరమైన అనుభవంగా కూడా ఉంటుంది. చర్మం పాడవుతుంది. దీని నుంచి బయటపడేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.
హోలీ సమయంలో ఉపయోగించే హానికరమైన కలర్ పౌడర్ల వల్ల చాలా మంది చర్మం పొడిబారడం, చికాకు, అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, ఎరుపు, మొటిమలు వంటి చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. చర్మవ్యాధి నిపుణులు మీరు హోలీకి ముందు, తర్వాత అనుసరించాల్సిన ఉపయోగకరమైన చర్మ సంరక్షణ చిట్కాలను అందించారు.
ఐస్ ప్యాక్స్ వాడండి
ఐస్ ప్యాక్‌లు చర్మానికి అద్భుతాలు చేస్తాయి. హోలీ ఆడే ముందు ఐస్ క్యూబ్స్ అప్లై చేయడం వల్ల రంద్రాల రూపాన్ని తగ్గించుకోవచ్చు. హానికరమైన రసాయన రంగులు మీ చర్మంలోకి ప్రవేశించకుండా, మొటిమలను కలిగించకుండా నిరోధించడానికి మీరు కనీసం 15 నిమిషాల పాటు మీ ముఖంపై కొన్ని ఐస్ క్యూబ్‌లను రుద్దవచ్చు.
సన్ స్క్రీన్ ఉపయోగించండి
అందరూ ఆరుబయట హోలీ ఆడటానికి ఇష్టపడతారు. సూర్యరశ్మి, రంగు, నీటికి నిరంతరం బహిర్గతం చేయడం వల్ల మీ చర్మం మీద ప్రభావం ఉంటుంది. అందువల్ల పొడి, మెరిసే చర్మం అలాగే ఉండాలంటే.. సరైన సన్‌స్క్రీన్‌ని ఎంచుకోవాలి.
నూనె రాసుకోండి
నూనెను మీ జుట్టుకు మాత్రమే కాకుండా మీ శరీరానికి కూడా అప్లై చేయాలి. నూనె రాసుకోవడం వల్ల రంగు తేలికగా తీసివేయవచ్చు. కడిగితే ఈజీగా పోతుంది. అలాగే రంగు చర్మంలోకి చొచ్చుకుపోదు. ఆయిల్ స్కిన్ సహజ ఆకృతిని పునరుద్ధరించడానికి, అలెర్జీలు, మొటిమలను నిరోధించడంలో సహాయపడుతుంది. కొబ్బరి లేదా బాదం వంటి ఏదైనా నూనెను ఎంచుకోవడం మంచిది.
పెదవులపై శ్రద్ధ పెట్టాలి
హోలీ సమయంలో ముఖంపై శ్రద్ధ పెట్టి చాలా మంది పెదాలను పట్టించుకోరు. మీ చర్మంలో అత్యంత సున్నితమైన భాగం మీ పెదవులు. హోలీ ఆడే ముందు సహజ లిప్ బామ్ రాసుకోండి. సహజమైన లిప్ బామ్‌లు మీ పెదాలకు తేమగా ఉంచుతుంది. మీ పెదవుల పగుళ్లలో హానికరమైన రంగులు స్థిరపడకుండా అడ్డుకుంటుంది. లిప్ బామ్ పెదాలను మృదువుగా ఉంచుతుంది.
నీరు ఎక్కువగా తాగాలి
రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగటం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండటం, శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు పంపడం ద్వారా చర్మం పొడిబారకుండా, పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. హోలీ సందర్భంగా మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాలి. దురద, అలెర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే పైన చెప్పిన విధంగా హోలీ ముందు, తర్వాత జాగ్రత్తలు తీసుకోండి.
వీలైనంత వరకూ సహజ రంగులను ఉపయోగించండి. మార్కెట్లో దొరికే రంగులు రసాయనాలతో నిండి ఉంటాయి. వీటి ద్వారా మీ చర్మ ఆరోగ్యం పాడవుతుంది. సహజంగా ఇంట్లోనే రంగులు తయారుచేసుకుని హోలీ వేడుకలు జరుపుకోండి.