Manikonda ZPH School : మణికొండ జడ్పీ హైస్కూల్ కు ఆర్క్ సెర్వ్ సంస్థ భారీ విరాళం, విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ-hyderabad arc serv adopted manikonda zph school on csr gives tabs to students ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Manikonda Zph School : మణికొండ జడ్పీ హైస్కూల్ కు ఆర్క్ సెర్వ్ సంస్థ భారీ విరాళం, విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ

Manikonda ZPH School : మణికొండ జడ్పీ హైస్కూల్ కు ఆర్క్ సెర్వ్ సంస్థ భారీ విరాళం, విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ

Bandaru Satyaprasad HT Telugu
Aug 12, 2024 04:51 PM IST

Manikonda ZPH School : ఆర్క్ సెర్వ్ సంస్థ తన పదో వార్షికోత్సవాన్ని మణికొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో కలిసి చేసుకుంది. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ట్యాబ్ లు అందించింది. సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ ను ఆర్క్ సెర్వ్ దత్తత తీసుకుంది. ఉపాధ్యాయుల నియామ‌కానికి రూ.8 ల‌క్షల విరాళం అందించింది.

మణికొండ జడ్పీ హైస్కూల్ కు ఆర్క్ సెర్వ్ సంస్థ భారీ విరాళం, విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ
మణికొండ జడ్పీ హైస్కూల్ కు ఆర్క్ సెర్వ్ సంస్థ భారీ విరాళం, విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ

Manikonda ZPH School : ఆర్క్ సెర్వ్ సాఫ్ట్ వేర్ సంస్థ త‌న ప‌దో వార్షికోత్సవాన్ని హైదరాబాద్ మ‌ణికొండ‌లోని జ‌డ్పీ హైస్కూలు విద్యార్థుల‌తో క‌లిసి సెలబ్రేట్ చేసుకుంది. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బ‌హుమ‌తులు ఇవ్వడంతో పాటు స్థానిక విద్యా కార్యక్రమాల‌కు మ‌ద్దతు ప‌లికింది. 2022లో మ‌ణికొండ జ‌డ్పీ హైస్కూలును ద‌త్తత చేసుకున్నప్పటి నుంచి ఆర్క్ సెర్వ్ సంస్థ త‌న సీఎస్ఆర్ కార్యక్రమాల‌తో 1,473 మంది పిల్లల‌పై సానుకూల ప్రభావం చూపింది.

చదువుల్లో ఉత్తమ ఫ‌లితాలు సాధించిన విద్యార్థులు డి. కుష్వంత్ ర‌ణ‌చంద్రవ‌ర్మ (ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల్లో 10/10), ఎస్. భార్గవి (9.8/10), బాస‌ర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఎం. మిర్యామిల‌ను ఆర్క్ స‌ర్వ్ సంస్థ స‌త్కరించి, వారికి ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్క్ స‌ర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్, ప్రొడ‌క్ట్ మేనేజ్‌మెంట్ ఈవీపీ మైఖేల్ లిన్, వైస్ ప్రెసిడెంట్, జీఎం అంబరీష్ కుమార్, హెచ్ఆర్ డైరెక్టర్ కరుణ గెడ్డం, ఫెసిలిటీస్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్, సీఎస్ఆర్ లీడ్ స్వాతి తిరునగరి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆర్క్ స‌ర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్ మాట్లాడుతూ, గ‌డిచిన రెండేళ్లలో ఈ పాఠ‌శాల విద్యాప‌రంగా, మౌలిక వ‌స‌తుల ప‌రంగా ఎంతో పురోగ‌తి సాధించిందని, ఉపాధ్యాయులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నార‌న్నారు. ప‌రీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారని హ‌ర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ త‌ర‌గ‌తి గ‌దులను అప్‌గ్రేడ్ చేయ‌డంతో పాటు క్రీడామైదానాన్ని మెరుగుప‌రిచామ‌ని చెప్పారు. ఒక‌ప్పుడు కేవ‌లం 1,300 విద్యార్థులు ఉండే ఈ స్కూల్లో ఇప్పుడు గ‌ణ‌నీయ‌మైన ప్రగ‌తి క‌నిపిస్తోంద‌న్నారు. ఇక్కడి ఉపాధ్యాయుల కొర‌త‌ను తీర్చేందుకు పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్ అనే సంస్థకు రూ. 8 ల‌క్షల విరాళం ఇస్తున్నామ‌ని, దీంతో ఆ సంస్థ ఉన్నత త‌ర‌గ‌తుల కోసం ఏడుగురు అద‌న‌పు ఉపాధ్యాయుల‌ను నియ‌మిస్తుంద‌ని తెలిపారు. 2022-23లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 182 ఉత్తీర్ణత సాధించగా, 2023-24లో అది 204కు పెరిగి, 10.78% వృద్ధి క‌నిపించింద‌న్నారు.

విద్యార్థుల ఆరోగ్యం విష‌యంలో కూడా ఆర్క్ సెర్వ్ సంస్థ త‌గిన జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. రుతుక్రమ విష‌యంలో విద్యార్థినుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, శానిట‌రీ నాప్కిన్ల పంపిణీతో పాటు.. నిర్మాణ్ సంస్థ స‌హ‌కారంతో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. పిల్లల‌కు క్రీడా ప‌రిక‌రాలు, ఇత‌ర ప‌రిక‌రాలు అందిస్తోందని ఆ సంస్థ సీఈవో క్రిస్ బాబెల్ తెలిపారు.

సంబంధిత కథనం