Alert in Hyderabad : బెంగుళూరులో పేలుళ్లు - హైదరాబాద్ లో హై అలర్ట్, పలుచోట్ల తనిఖీలు!
High Alert in Hyderabad:బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించిన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. .నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
High Alert in Hyderabad : బెంగుళూరు లో పేలుడుతో హైదరాబాద్ లో హై అలర్ట్ విధించారు నగర పోలీసులు. పలు చోట్ల పోలీసుల తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ తోపాటు... పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు.
రామేశ్వరం కెఫేలో పేలుడు
Explosion in Bengaluru: బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫే లో ఈ పేలుడు సంభవించింది. ఫలితంగా బెంగళూరు నగరం భారీ పేలుడుతో ఉలిక్కిపడింది.
బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫే లో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు లో పలువురుకి గాయాలయ్యాయి. పేలుడు సమచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ పేలుడుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ పేలుడు ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కుట్ర కోణం ఏదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పేలుడు కు సంబంధించిన కీలక వివరాలు..
1. బెంగళూరులోని రామేశ్వరం కెఫే లో జరిగిన పేలుడు (Bengaluru explosion)లో 9 మంది గాయపడ్డారు.
2. కెఫే లో జరిగినందున ఇది సిలిండర్ పేలుడు అని మొదట భావించారు. కానీ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మొదట ఇది సిలిండర్ పేలుడు కాదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ కస్టమర్ వదిలివెళ్లిన బ్యాగ్ నుంచి పేలుడు సంభవించిందని కెఫే వ్యవస్థాపకుడు నాగరాజ్ తేజస్వి తెలిపారు.
3. పేలుడు జరిగినప్పుడు లోపల చాలా మంది ఉన్నారని రామేశ్వరం కెఫే (Rameshwaram cafe) సెక్యూరిటీ గార్డు ధృవీకరించారు. పెద్ద శబ్దం రావడంతో మంటలు చెలరేగి కస్టమర్లకు గాయాలయ్యాయి. కస్టమర్లు చేతులు కడుక్కునే ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు సమాచారం.
4. ఫోరెన్సిక్ నిపుణులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
5. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.
6. పేలుడు తర్వాత కెఫేలోని నేలపై పగిలిన గాజులు మరియు ఫర్నీచర్ పడి ఉన్నాయి. రామేశ్వరం కెఫే ఒక ప్రసిద్ధ హోటల్. ఇక్కడ మధ్యాహ్న భోజన సమయంలో చాలా రద్దీగా ఉంటుంది.
7. NIA దాని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తుంది.
8. ఫోరెన్సిక్స్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ తెలిపారు.
9. అన్ని కోణాల్లోనూ విచారిస్తామని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.
10. కేఫ్ చైన్ కో-ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ దివ్య రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, ఒకదానికొకటి 10 సెకన్లలోపు రెండు పేలుళ్లు సంభవించాయని తనకు చెప్పారని చెప్పారు.