Gutta SukhenderReddy: తెలంగాణపై ప్రధాని మోడీ విషం చిమ్ముతున్నారన్న గుత్తా సుఖేందర్‌-gutta sukhender reddy accused prime minister modi of spewing poison in telangana state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gutta Sukhenderreddy: తెలంగాణపై ప్రధాని మోడీ విషం చిమ్ముతున్నారన్న గుత్తా సుఖేందర్‌

Gutta SukhenderReddy: తెలంగాణపై ప్రధాని మోడీ విషం చిమ్ముతున్నారన్న గుత్తా సుఖేందర్‌

HT Telugu Desk HT Telugu
Sep 19, 2023 11:51 AM IST

Gutta SukhenderReddy: దేశ ప్రధానిగా ఉండి నరేంద్ర మోడి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై విషం చిమ్ముతున్నారని, గుజరాత్ లో రక్తపుటేరులు పారిన సంఘటనలను ఆయన ఇంకా మరవనట్లు ఉందని ఎద్దేవా చేశారు.

మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutta SukhenderReddy: దేశ ప్రధానిగా ఉండి నరేంద్ర మోడి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై విషం చిమ్ముతున్నారని, గుజరాత్ లో రక్తపుటేరులు పారిన సంఘటనలను ఆయన ఇంకా మరవనట్లు ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ విభజన సరిగా జరగలేని ప్రధాని మోడి పార్లమెంటు వేదికగా చేసిన ప్రసంగాన్ని తప్పు పట్టారు. ఇప్పటికీ కనీసం మూడు సార్లు ప్రధాని ఇలా తెలంగాణ ఏర్పాటుపై తన అక్కసు వెళ్లగక్కారని దుయ్యబట్టారు. తెలంగాణ మీద కొత్తగా ప్రేమను ఒలకబోస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధాని మోడీ ప్రకటనపై ఏ మాట్లాడతారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ రాష్ట్ర విభజనను సరిగా చేపట్టలేదని మాట్లాడుతున్న మోడి 2003లో బీజేపీ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ రాష్ట్రన్ని ఏర్పాటు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ధ్వజమెత్తారు. కేసీఆర్ అలుపెరుగని పోరాట ఫలితంగానే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందని, ప్రజల ఒత్తిడి మేరకు తెలంగాణ ఏర్పాటు అయ్యిందని పేర్కొన్నారు.

మనసు నిండా విషం….

‘ మోడీ మనసు నిండా విషమే ఉందని మోడీ మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా అని ప్రశ్నించారు. పదే పదే ప్రధాని తెలంగాణ విషయంలో ఎందుకు విషం గక్కుతున్నారని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటును.. అనతి కాలంలోనే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగడాన్ని.. అనేక రంగాల్లో తన గుజతార్ కంటే తెలంగాణ ముందు ఉండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారా అని నిలదీశారు.

మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టేలా హామీలు ఇస్తోందని చెప్పారు. 6 గ్యారంటీ హామీలు అన్నీ ఉత్తివేనని వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఏం చేయాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.

కాంగ్రెస్ చెప్పేవి అన్నీ బోగస్ హామీలని, కాంగ్రెస్ హామీలు ఆచరణలో సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ కు విజన్ లేదన్నారు. కేవలం అధికారం దాహమే ఉందని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ పని అని బీజేపీ పతనం ప్రారంభం అయిందన్నారు. అందుకే మళ్ళీ మహిళ రిజర్వేషన్ బిల్లు అంటూ హడావుడి చేస్తోందన్నారు. కుంభకోణలకు కేరాఫ్ అడ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని బోఫోర్స్ కుంభకోణంతో కాంగ్రెస్ పతనమైందన్నారు.

(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ)

Whats_app_banner