Cyber Crime: కరెంట్ బిల్లు పేరుతో సైబర్ నేరగాళ్ళ దోపిడి,ఎల్ఐసి ఏజెంట్ అకౌంట్ నుంచి రూ. 5.23 లక్షలు స్వాహా-extortion by cyber criminals in the name of current bill ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cyber Crime: కరెంట్ బిల్లు పేరుతో సైబర్ నేరగాళ్ళ దోపిడి,ఎల్ఐసి ఏజెంట్ అకౌంట్ నుంచి రూ. 5.23 లక్షలు స్వాహా

Cyber Crime: కరెంట్ బిల్లు పేరుతో సైబర్ నేరగాళ్ళ దోపిడి,ఎల్ఐసి ఏజెంట్ అకౌంట్ నుంచి రూ. 5.23 లక్షలు స్వాహా

HT Telugu Desk HT Telugu
Jul 24, 2024 07:12 AM IST

Cyber Crime: సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిందో అంతకంటే రెట్టింపు మోసాలు జరుగుతున్నాయి. ఆన్ లైన్ లో కరెంటు బిల్లు చెల్లించే వెసులుబాటును TGNPDCL కల్పించగా అదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్ళు తమ మోసాలకు తెరలేపారు.

గోదావరి వరద ఉధృతిని పరిశీలిస్తున్న రామగుండం ఎస్పీ
గోదావరి వరద ఉధృతిని పరిశీలిస్తున్న రామగుండం ఎస్పీ

Cyber Crime: కరెంటు బిల్లు పేరుతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎల్ఐసి ఏజెంట్ అకౌంట్ నుంచి 5 లక్షల 23 వేల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు.

మంచిర్యాల హైటెక్ సిటీ కాలనీ చెందిన ఎల్ఐసి ఏజెంట్ వనం రఘు కు ఈనెల 15న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ (TGNPDCL) నుండి ఒక లింక్ అతని మొబైల్ ఫోన్ కి వచ్చింది. ఆ లింక్ కు ను రఘు ఓపెన్ చేయగా OTP వచ్చింది. వెంటనే సైబర్ నేరగాడు రఘు కు కాల్ చేసి తాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నామని.

ఎలక్ట్రిసిటీ బిల్ verify చేస్తున్నామని మీ మొబైల్ కు వచ్చిన OTPని మెసేజ్ వచ్చిన నెంబర్ కు పంపించమని చెప్పాడు మోసగాడు. వెంటనే రఘు అట్టి OTP ని సైబర్ నేరగాడి నెంబర్ కు మెసేజ్ చేసినాడు. ఆ తరువాత రఘు అకౌంట్ నుండి 5,23,000/- రూపాయలు సైబర్ నేరగాడి అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయిపోయాయి. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయం కావడంతో మోసపోయానని గ్రహించిన రఘు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ మోసం పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కొత్త తరహా మోసాలు...

సైబర్ నేరగాళ్ళు రోజురోజుకి కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని జనాలను మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు అపరచిత వ్యక్తులు పంపే మెసేజ్ లకు రెస్పాన్స్ ఇవ్వడం గాని లేదా వారు పంపే లింక్ లను ఓపెన్ చేయడం గాని చేయవద్దని కోరారు.

బ్యాంకు వారు గాని ఇతర డిపార్ట్మెంట్ వారు గాని ఎవ్వరు మెసేజ్ రూపంలో ప్రజలు ఎవ్వరిని సంప్రదించరనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు ప్రజల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని కొత్త తరహా సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజల అకౌంట్ ల నుండి డబ్బును కాజేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల మాయలో పడి తమ డబ్బును పోగొట్టుకోవద్దని సూచించారు.

బ్రిడ్జి తనిఖీ...వరద ప్రవాహాల పరిశీలన..

ఎగువన మహారాష్ట్ర కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి, ప్రాణహిత నదీ తీరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ కోరారు.

ప్రాణహిత, గోదావరిలో వరద ఉదృతంగా ఉండడంతో తీర ప్రాంతాల్లో హై అలెర్ట్ కొనసాగిస్తున్నామని తెలిపారు. రామగుండం సమీపంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్, అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్ సందర్శించి ప్రాణహీత వరద ఉదృతిని పరిశీలించారు.

పరివాహక ప్రాంత గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయని... వారికి అందుతున్న సహాయ చర్యల గురించి ఆరా తీశారు. వరదల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం శిక్షణా పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన డిడిఆర్ఎఫ్ (డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పోలీసు టీమ్ ఎల్లపుడు అందుబాటులో ఏర్పాటు చేశామని తెలిపారు.

ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసువారి సహాయం పొందాలని కోరారు. ఉదృతంగా నదులు ప్రవహిస్తున్నందున వరద నీటి వద్దకు, జలపాతాలు, చెరువులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు.

(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner