KTR Brother In Law: రాడిసన్ డ్రగ్స్ వ్యవహారంలో మీడియా సంస్థలకు కేటీఆర్ బామ్మర్ది పాకాల లీగల్ నోటీసులు…
KTR Brother In Law: పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది పాకాల రాజేంద్ర ప్రసాద్ పలు సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు.
KTR Brother In Law: రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో తనపై అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పలు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు.
కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన రాడిసన్ హోటల్ డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ బామ్మర్ది పాకాల రాజేంద్ర ప్రసాద్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పలు సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అసత్య కథనాలతో తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు.
ఒక్కో మీడియా సంస్థపైన 10 కోట్ల దావా చెల్లించాలని, అసత్య కథనాలను వారంలోగా ఆన్‌లైన్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. అయా మీడియా సంస్థలతో గూగుల్ ఇండియా, యూ ట్యూబ్ సంస్థలకు కూడా నోటీసులు పంపారు.
రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్ దందాలో సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అని పలు మీడియా సంస్థల్లో వార్తలు రావడంపై అభ్యంతరం తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించారని, తాను అనుభవించిన మానసిక వేదనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఏమి జరిగిందంటే….
హైదరాబాద్ లో గత ఫిబ్రవరిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటలో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల తనిఖీల్లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ నేత కుమారుడితో పాటు ఓ వ్యాపారవేత్త కుమారుడు, మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గచ్చిబౌలి(Gachibowli)లోని ఓ స్టార్ హోటల్ లో కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాడిసన్ హోటల్ లో ప్రముఖ బీజేపీ నేత(BJP Leader) కుమారుడితో పాటు ఓ వ్యాపారవేత్త కుమారుడు డ్రగ్స్ పార్టీ(Drugs Party) ఇస్తున్నట్లు సమాచారంలో పోలీసులు తనిఖీలు చేశారు.
ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన హైదరాబాద్ డ్రగ్స్ మహమ్మారి ఏదో రూపంలో బయటపడుతుంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ పోలీసులు తనిఖీలు చేసి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.
బీజేపీ నేత కుమారుడు అరెస్ట్?
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో కొందరు యువకులు పార్టీ చేసుకుంటున్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ (Drugs)వినియోగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... తనిఖీలు చేయగా పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు.
ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తు్న్నారు. వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల తనిఖీల సమయంలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఏస్ఓటీ పోలీసులు రాడిసన్ హోటల్ సోదాలు చేశారని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ తనిఖీల్లో కొకైన్ పట్టుబడిందన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేత కుమారుడు, మంజీర గ్రూప్ డైరెక్టర్ వివేకానంద, నిర్భయ్, కేదార్ అనే మరో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామన్నారు. ఈ ముగ్గురు కొకైన్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో హోటల్ పై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. హోటల్ కి వచ్చి అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. అతడి కోసం గాలిస్తున్నామన్నారు.
డ్రగ్స్ పార్టీలో సినీ ప్రముఖులు..
తెలంగాణలో సంచలనమైన రాడిసన్ డ్రగ్స్ పార్టీ (Radisson Drugs Case)కేసులో కీలక పేర్లు బయటకు వస్తున్నాయి. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్ నటి లిషి గణేష్ తో పాటు దర్శకుడు క్రిష్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ చేర్చారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మంగళవారం మీడియాకు వివరించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్న ఆయన...డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
బీజేపీ నేత కుమారుడు, మంజీరా గ్రూప్ ఛైర్మన్ వివేకానందకు అబ్బాస్ 10 సార్లు కొకైన్ డెలివరీ చేశాడని పోలీసులు తెలిపారు. అబ్బాస్ గతంలో మంజీరా సంస్థలో పనిచేశాడన్నారు. రాడిసన్ హోటల్‌లో గతంలో చాలాసార్లు ఇలాంటి తరహా పార్టీలు జరిగాయన్నారు. నిందితుల్లో వివేకానంద, కేదార్, నిర్భయ్ డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయిందని డీసీపీ వినీత్ స్పష్టం చేశారు. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఈ కేసులో నిందితులైన మరో ముగ్గురు నిందితులు లిషి(Lishi Ganesh), శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారని డీసీపీ వినీత్ తెలిపారు. మరో నిందితుడు చరణ్ బెంగళూరులో ఉన్నట్లు తెలిసిందన్నారు. అడ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో తన పేరు రావడంపై డైరెక్టర్ క్రిష్(Director Krish) స్పందించారు. తాను రాడిసన్ హోటల్‌కు వెళ్లింది నిజమేనని, అయితే తన స్నేహితులను కలవడం కోసమే వెళ్లానని తెలిపారు. అరగంట పాటు హోటల్‌లో ఉండి సాయంత్రం 6.45 గంటలకు హోటల్ నుంచి వెళ్లిపోయానన్నారు.
సంబంధిత కథనం