TS LAWCET 2024 Updates : 'లాసెట్' కు ప్రిపేర్ అవుతున్నారా..? పరీక్షా విధానం, సిలబస్ ఇదే-download telangana lawcet 2024 exam syllabus check the steps are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Download Telangana Lawcet 2024 Exam Syllabus Check The Steps Are Here

TS LAWCET 2024 Updates : 'లాసెట్' కు ప్రిపేర్ అవుతున్నారా..? పరీక్షా విధానం, సిలబస్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 07, 2024 08:00 PM IST

TS Lawcet 2024 Updates : తెలంగాణ లాసెట్ - 2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 5వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగుస్తుంది. జూన్ 3వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలను ఇక్కడ చూడండి….

తెలంగాణ లాసెట్ - 2024
తెలంగాణ లాసెట్ - 2024 (https://lawcet.tsche.ac.in/)

TS Lawcet 2024 Syllabus: తెలంగాణలోని న్యాయ కళాశాల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతి ఏడాది లాసెట్ ప్రవేశ పరీక్షను(Telangana Lawcet 2024) నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కూడా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ రాగా… ఆన్ లైన్ లో అప్లికేషన్లను కూడా స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా(LLB Courses) కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో(LLM Courses) ప్రవేశాలు పొందవచ్చు. జూన్ 3వ తేదీన ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

TS Lawcet 2024 Syllabus: తెలంగాణ లాసెట్ సిలబస్ ఇదే

లాసెట్ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సులకు వేర్వురు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది.

TS LLB ఐదేళ్లు, మూడేళ్ల కోర్సు పరీక్షా విధానం…

పార్ట్ A - ఇందులో 30 మార్కులు ఉంటాయి. General Knowledge and Mental Ability నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పార్ట్ B - ఈ సెక్షన్ కు కూడా 30 మార్కులు కేటాయించారు. Current Affairs నుంచి ప్రశ్నలు వస్తాయి.

పార్ట్ C - ఈ సెక్షన్ లో 60 మార్కులు ఉంటాయి. Aptitude for the Study of Law నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా భారత రాజ్యాంగం నుంచి క్వశ్చన్లు ఉంటాయి. లీగల్ పరిభాషకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి.

LLM పరీక్షా విధానం, సిలబస్

TS LLM Exam 2024: ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.

Part-A: ఈ సెక్షన్ నుంచి 40 మార్కులు ఉంటాయి.JURISPRUDENCE సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు, CONSTITUTIONAL LAW నుంచి 20 మార్కులు ఉంటాయి.

Part-B: ఈ పార్ట్ లో 80 మార్కులు ఉంటాయి.

PUBLIC & PRIVATE INTERNATIONAL LAW: 16 మార్కులు.

BUSINESS AND CORPORATE LAWS: 16 మార్కులు.

LABOUR LAW: 16 Questions … 16 మార్కులు.

CRIMES and TORTS: 16 మార్కులు.

OTHER ALLIED LAWS: 16 మార్కులు.

ముఖ్య వివరాలు:

ప్రవేశ పరీక్ష - తెలంగాణ లాసెట్ - 2024.

కోర్సులు - ఎల్ఎల్ బీ ఐదేళ్లు, ఎల్ఎల్ బీ మూడేళ్ల, ఎల్ఎల్ఎం

అర్హతలు - ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ అర్హత పొంది ఉండాలి. ఐదేళ్ల కోర్సు కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేయాలంటే… కామన్ డిగ్రీతో పాటు లా డిగ్రీ కూడా ఉండాలి.

దరఖాస్తులు - ఆన్ లైన్

దరఖాస్తులకు తుది గడువు - ఏప్రిల్ 15,2024.

రూ. 500 ఆలస్య రుసుంతో - 25-04-2024

రూ. 1,000 ఆలస్య రుసుముతో - 05-05-2024

రూ. 2,000 ఆలస్య రుసుముతో 15-05-2024

రూ. 4,000 ఆలస్య రుసుముతో 25-05-2024

దరఖాస్తు రుసుం - ఓబీసీలు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు రూ. 600 చెల్లించాలి.

పరీక్ష తేదీ - జూన్ 03,2024

అధికారిక వెబ్ సైట్ - https://lawcet.tsche.ac.in/

How to apply For TS LAWCET 2024: ఇలా దరఖాస్తు చేసుకోండి….

అర్హత గల అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

TS LAWCET & TS PGLCET 2024 లింక్ పై క్లిక్ చేయాలి.

తొలుత పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.

STEP 2:Fill Application Form అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై నొక్కి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

సబ్మిట్ బటన్ నొక్కటంతో మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

Download Application Form అనే ఆప్షన్ పై నొక్కి మీ దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ ఫారమ్ లో ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ అవసరపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం