OU LLB LLM : ఓయూ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంకి వన్ టైం ఛాన్స్.. ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి-osmania university gives special one time chance to clear backlogs in llb and llm ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ou Llb Llm : ఓయూ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంకి వన్ టైం ఛాన్స్.. ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి

OU LLB LLM : ఓయూ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంకి వన్ టైం ఛాన్స్.. ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Jan 17, 2023 09:07 PM IST

OU LLB LLM : ఓయూ పరిధిలో బ్యాక్ లాగ్స్ ఉన్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం విద్యార్థులకు స్పెషల్ వన్ టైం ఛాన్స్ కల్పించింది.. ఉస్మానియా విశ్వవిద్యాలయం. 2000 సంవత్సరం నుంచి 2017 మధ్య బ్యాచ్ వారందరికీ అవకాశం కల్పిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయం

OU LLB LLM : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో LLB, LLM కోర్సులు చదివి.. ఇంకా బ్యాక్ ల్యాగ్ సబ్జెక్ట్ లు ఉన్నవారికి... ఓయూ మరో అవకాశాన్ని కల్పించింది. పరీక్షలకు హాజరై సబ్జెక్టులు క్లియర్ చేసుకునేందుకు ప్రత్యేక వన్ టైం ఛాన్స్ కల్పిస్తూ.. నిర్ణయం తీసుకుంది. గతంలో 2010 నుంచి 2017 మధ్య బ్యాచ్ వారికి ఈ ఆఖరి అవకాశం కల్పించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. ఈ సారి 2000 సంవత్సరం నుంచి 2017 మధ్య బ్యాచ్ వారందరికీ స్పెషల్ వన్ టైం ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు.. షెడ్యూల్ విడుదల చేసిన ఓయూ.. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకోవాలని అనుకునే వారు... పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

yearly horoscope entry point

నోటిఫికేషన్ ప్రకారం... 2000 - 2017 మధ్య బ్యాచ్ కు చెందిన వారు.. బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు ఒక్కో సబ్జెక్టుకి రూ. 10 వేలు పెనాల్టీ చార్జెస్ కింద చెల్లించాలి. పరీక్ష ఫీజు అదనంగా ఉంటుంది. పరీక్షలకు హాజరవ్వాలని అనుకునే విద్యార్థులు... ఓయూ ఎగ్జామ్ బ్రాంచ్ వద్ద ఉన్న ఎస్బీఐలో ఛలాన్ ద్వారా ఫీజు చెల్లించాలని... పూర్తి చేసిన అప్లికేషన్ ను ఎగ్జామ్ బ్రాంచ్ లో సమర్పించాలని పేర్కొంది. ఫిబ్రవరి 2 వరకు అప్లికేషన్లు సబ్మిట్ చేయవచ్చు. రూ. 200 లేట్ ఫీజు తో ఫిబ్రవరి 10వ తేదీ వరకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్ సైట్ ను సందర్శించగలరు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ, డిగ్రీ కి చదివి, బ్యాక్ లాగ్స్ ఉన్న వారికీ వన్ టైం ఛాన్స్ ఇస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2000 - 2017 మధ్య పీజీ కోర్సుల్లో రిజిస్టరై... ఇప్పటికీ బ్యాక్ ల్యాగ్స్ ఉన్న వాళ్లకు వన్ టైం ఛాన్స్ పేరిట ఓయూ మరోసారి అవకాశాన్ని కల్పించింది. జనవరి 27 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని... ఆలస్య రుసుము రూ. 300 తో ఫిబ్రవరి 4 వరకు గడువు ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ బ్రాంచ్ లో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.

2000 - 2014 మధ్య ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్ డబ్ల్యూ కోర్సుల్లో ఇంకా సబ్జెక్టులు క్లియర్ కాకుండా మిగిలి ఉన్న వారికీ వన్ టైం చాన్స్ కల్పించారు. జనవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించాలని... లేట్ ఫీజు రూ. 500 తో కలిపి జనవరి 25వ వరకు అవకాశం ఉందని పేర్కొంది. డిగ్రీ విద్యార్థులు తమ కళాశాలల్లో ఫీజు చెల్లించవచ్చని సూచించింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం.. గత కొన్నేళ్లుగా బ్యాక్ ల్యాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్ టైం ఛాన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. గతంలో నామమాత్రపు ఫీజుతో ఈ పరీక్షలు నిర్వహించిన ఓయూ... గతేడాది నుంచి పెనాల్టీ ఛార్జెస్ కింద భారీ మొత్తంలో వసూలు చేస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కో పేపర్ కి రూ. 10 వేల పెనల్ ఛార్జెస్ చెల్లించాలనడం.. పేదలను విద్యకు దూరం చేయడమే అనే విమర్శలు వస్తున్నాయి. అభ్యర్థుల అవకాశాన్ని ఆసరాగా చేసుకొని... యూనివర్సిటీ సొమ్ము చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. పెనల్ ఛార్జెస్ తగ్గించాలని విద్యార్థులు, అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Whats_app_banner