TS LAWCET 2024 : 'లాసెట్' దరఖాస్తులు ప్రారంభం - అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోవచ్చు-ts lawcet and pglcet 2024 registration process begins on march 1 check the steps are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet 2024 : 'లాసెట్' దరఖాస్తులు ప్రారంభం - అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోవచ్చు

TS LAWCET 2024 : 'లాసెట్' దరఖాస్తులు ప్రారంభం - అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోవచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 08, 2024 08:24 AM IST

TS LAWCET 2024 Updates: తెలంగాణ లాసెట్ - 2024 ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా… జూన్ 3వ తేదీన ఎగ్జామ్స్ జరగనున్నాయి.

టీఎస్ లాసెట్ - 2024
టీఎస్ లాసెట్ - 2024

TS LAWCET 2024 Updates: తెలంగాణ లాసెట్ - 2024 (TS LAWCET)షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇందులో భాగంగా…. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. జూన్ 3వ తేదీన ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

yearly horoscope entry point

ముఖ్య వివరాలు:

ప్రవేశ పరీక్ష - తెలంగాణ లాసెట్ - 2024.

కోర్సులు - ఎల్ఎల్ బీ ఐదేళ్లు, ఎల్ఎల్ బీ మూడేళ్ల, ఎల్ఎల్ఎం

అర్హతలు - ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ అర్హత పొంది ఉండాలి. ఐదేళ్ల కోర్సు కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేయాలంటే… కామన్ డిగ్రీతో పాటు లా డిగ్రీ కూడా ఉండాలి.

దరఖాస్తులు - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.

దరఖాస్తులకు తుది గడువు - ఏప్రిల్ 15,2024.

రూ. 500 ఆలస్య రుసుంతో - 25-04-2024

రూ. 1,000 ఆలస్య రుసుముతో - 05-05-2024

రూ. 2,000 ఆలస్య రుసుముతో 15-05-2024

రూ. 4,000 ఆలస్య రుసుముతో 25-05-2024

దరఖాస్తు రుసుం - ఓబీసీలు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు రూ. 600 చెల్లించాలి.

పరీక్ష తేదీ - జూన్ 03,2024

అధికారిక వెబ్ సైట్ - https://lawcet.tsche.ac.in/

How to apply For TS LAWCET 2024: ఇలా దరఖాస్తు చేసుకోండి….

అర్హత గల అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

TS LAWCET & TS PGLCET 2024 లింక్ పై క్లిక్ చేయాలి.

తొలుత పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.

STEP 2:Fill Application Form అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై నొక్కి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

సబ్మిట్ బటన్ నొక్కటంతో మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

Download Application Form అనే ఆప్షన్ పై నొక్కి మీ దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ ఫారమ్ లో ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ అవసరపడుతుంది.

Whats_app_banner