Delhi Excise policy: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మనీ లాండరింగ్ అభియోగాలు….-delhi excise policy ed arrests aap in charge hyderabad businessman in money laundering case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Delhi Excise Policy: Ed Arrests Aap In-charge, Hyderabad Businessman In Money Laundering Case

Delhi Excise policy: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మనీ లాండరింగ్ అభియోగాలు….

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 01:36 PM IST

Delhi Excise policy: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఆధారంగా జరిగిన మద్యం సిండికేట్ల కుంభకోణంలో మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ ప్రకటించింది. మనీలాండరింగ్ లావాదేవీలపై విచారణకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లిని ఇడి అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టైన శరత్ చంద్రా రెడ్డి
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టైన శరత్ చంద్రా రెడ్డి (PTI)

Delhi Excise policy ఇదే కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసిన తర్వాత వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్‌లో నాయర్‌ను సీబీఐ అరెస్టు చేయగా, బోయిన్‌పల్లి గత నెలలో పట్టుబడ్డాడు.

ట్రెండింగ్ వార్తలు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టులో ఇద్దరిని కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఈడీ ప్రకటించింది.

ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ED దర్యాప్తు చేస్తోందని, మద్యం పాలసీ రూపకల్పన, అమలులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులు మరియు నిందితుల ద్వారా సేకరించిన సాక్ష్యాలు మరియు నమోదు చేసిన వాంగ్మూలాలతో ఇద్దరిని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో మద్యం కంపెనీ ఇండోస్పిరిట్ ప్రమోటర్ సమీర్ మహీంద్రు, లిక్కర్ కంపెనీ పెర్నోడ్ రికార్డ్ జనరల్ మేనేజర్ బెనోయ్ బాబు, అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పెనాక శరత్ చంద్ర రెడ్డిలను ఏజెన్సీ గతంలో అరెస్టు చేసింది.

ఈ కేసులో ఈడి అధికారులు ఇప్పటివరకు 169 సెర్చ్ ఆపరేషన్‌లు చేపట్టినట్లు ఇటీవల స్థానిక కోర్టుకు తెలియజేసింది.బినోయ్‌ బాబు, శరత్ రిమాండ్ రిపోర్ట్‌లో మద్యం పాలసీని బహిరంగంగా విడుదల చేయడానికి 45 రోజుల ముందు కొంతమంది మద్యం తయారీదారులకు వివరాలను "లీక్" చేశారని, ఢిల్లీ డిప్యూటీ సిఎంసిసోడియాతో సహా మూడు డజన్ల మంది విఐపిలు ఈ వ్యవహారంలో ఉన్నారని దర్యాప్తులో తేలింది. డిజిటల్ సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో దాదాపు 140 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఈడీ ఆరోపి్తోంది.

దర్యాప్తు సమయంలో పలువురు వ్యక్తులు "ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో ఎంపిక చేసిన వ్యాపార సమూహాలకు అనవసర ప్రయోజనాల కోసం ముందుగానే రూ. 100 కోట్ల వరకు లంచం ఇచ్చినట్లు వెల్లడైందని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొన్న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో మనీలాండరింగ్ కేసు కూడా తాజాగా చేర్చారు.

ఈ కేసు నమోదు చేసిన తర్వాత సిసోడియాతో పాటు కొందరు ఢిల్లీ ప్రభుత్వ బ్యూరోక్రాట్లపై సీబీఐ దాడులు చేసింది. ఓన్లీ మచ్ లౌడర్ (OML) అనే ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మాజీ సీఈఓ నాయర్ తరపున సిసోడియా సహచరుడు అర్జున్ పాండే ఒకసారి సమీర్ మహంద్రు నుంచి దాదాపు రూ.2-4 కోట్ల నగదు వసూలు చేశారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, సిసోడియా "సన్నిహిత సహచరులు" గా సిబిఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. గుర్గావ్‌లో ఉన్నదినేష్ అరోరా, అర్జున్ పాండే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం "మద్యం లైసెన్స్‌దారుల నుండి సేకరించిన అనవసరమైన ముడుపుల్ని తరలిచడంలో చురుకుగా పాల్గొన్నారని సిబిఐ చెబుతోంది.

ఎంటర్‌టైన్‌మెంట్ సర్క్యూట్‌లో పేరుగాంచిన నాయర్, ఇండీ బ్యాండ్‌ల నిర్వహణ సంస్థగా OMLని ప్రారంభించారు. అయితే కొంతమంది ప్రముఖ స్టాండప్ ఆర్టిస్టులు, కామెడీ కలెక్టివ్‌లు మరియు లైవ్ మ్యూజిక్ షోలతో క్రమంగా కామెడీ వైపు దృష్టి సారించారు.

మరోవైపు సిబిఐ, ఈడీ అభియోగాలను ఆప్ తోసిపుచ్చుతోంది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ఆప్‌ను అణిచివేసేందుకు ప్రచారాన్ని అడ్డుకోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నం"లో భాగమేనని ఆరోపించారు.

"విజయ్ నాయర్ ఆప్‌కి కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్‌గా పనిచేశాడని, అతను గతంలో పంజాబ్ మరియు ఇప్పుడు గుజరాత్‌లో కమ్యూనికేషన్ వ్యూహాలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడంలో బాధ్యత వహించాడని ఆప్‌ చెబుతోంది. అతనికి ఎక్సైజ్ పాలసీతో ఎటువంటి సంబంధం లేదని, విచిత్రంగా, అతన్ని సీబీఐ అరెస్టు చేసిందని, వాస్తవానికి అది ఎక్సైజ్ కేసు అని ఆప్‌ పేర్కొంది.

హైదరాబాద్‌ కేంద్రంగానే సిండికేట్లు….

హైదరాబాద్‌కు చెందిన బోయిన్‌పల్లిని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొనలేదు కానీ అతని సన్నిహితుడు, భాగస్వామి అరుణ్ రామచంద్ర పిళ్లై ఉన్నారు.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) డేటాబేస్ ప్రకారం, ఇద్దరూ ఈ ఏడాది జూలైలో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ LLPని స్థాపించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పెద్ద మద్యం పంపిణీదారులు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని సూచించే "సౌత్ లాబీ" కోసం "కార్టలైజేషన్"లో అతను పాల్గొన్నాడని సిబిఐ ఆరోపించింది.

ఢిల్లీ ఎక్సైజ్ విధానం 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన తర్వాత ఎక్సైజ్ పథకంపై దర్యాప్తు మొదలైంది. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ 11 మంది ఎక్సైజ్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.

మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, మంత్రి సత్యేందర్ జైన్, సిసోడియా పీఏతో పాటు ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు ఆటగాళ్లు, ప్రైవేట్ అధికారులను ఈడీ ప్రశ్నించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈకేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని విస్తృత ప్రచారం జరుగుతోంది.

IPL_Entry_Point

టాపిక్