Sangareddy News : వివాహేతర సంబంధం..! డబ్బుల కోసం గొడవలు, మహిళ దారుణ హత్య
Sangareddy district Crime News: డబ్బుల కోసం వేధిస్తుందని మహిళను అత్యంత పాశవికగా ఓ వ్యక్తి హత్య చేశాడు. బండ రాయితో కొట్టి పెట్రోలో పోసి కాల్చేశాడు. ఈ దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
Sangareddy district News: సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మహిళను దారుణంగా బాండ రాయితో కొట్టి హత్య చేసి,అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టి మృతదేహాన్ని నీటి గుంటలో పడేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామ శివారులో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్నూర మండలం గోవిందరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్డే సునీత (34) ను నాగులదేవులపల్లికి చెందిన ఓ వ్యక్తితో ఇరవై సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా కొన్ని కారణాల వాళ్ల సునీత పది సంవత్సరాల క్రితం భర్త నుండి విడాకులు తీసుకుంది. దీంతో ఆమె సొంతవూరైనా గోవిందరాజుపల్లిలో ఇల్లు నిర్మించుకొని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ కుమారులను పోషిస్తుంది. ఈ క్రమంలో సునీతకు మధుర గ్రామానికి చెందిన దత్తయ్యతో కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వారు వివాహేతర సంబంధాన్ని(extramarital affair) కొనసాగిస్తున్నారు.
తరుచూ గొడవలు.....
కాగా సునీత రోజు లాగానే జనవరి 31 రోజు ఇంటినుండి కూలీ పని కోసం వెళ్లి మరల తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తల్లి, పిల్లలు తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద, వెతికిన సునీత ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 5 న వారు హత్నూర పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించి నిందితుడు దత్తయ్యగా గుర్తించారు. దత్తయ్య ని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు ఆమె తరచూ వేలల్లో డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన దత్తయ్య ఆమెను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేశాడు. దానిలో భాగంగా జనవరి 31 రోజు సునీతను మాదారం గుట్టలోకి తీసుకువెళ్లాడు.
బండరాయితో కొట్టి, పెట్రోల్ తో కాల్చి ......
అక్కడ సునీత తలపై బండరాయితో బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చి సమీపంలో ఉన్న నీటి గుంటలో పడేసి పైన పెద్ద బండ రాళ్ళూ పెట్టానని పోలీసులకు వివరించాడు. దత్తయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు నీటి గుంట వద్దకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడే పోస్టు మార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడు దత్తయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.
పూజ గదిలో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీర కొంగుకు నిప్పంటుకుని మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన కొమండ్ల సువర్ణ (60) ,రాజిరెడ్డి దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె ఈ నెల 4న ఆదివారం రోజు ఇంట్లో పూజ చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయాలయ్యాయి . వెంటనే భర్త రామాయంపేట ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు పరిశీలించి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.