Nirmal District : నిర్మల్ జిల్లాలో దారుణం... నడిరోడ్డుపై ప్రియురాలిని చంపిన ప్రియుడు... !-young man killed his girl friend in nirmal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Young Man Killed His Girl Friend In Nirmal District

Nirmal District : నిర్మల్ జిల్లాలో దారుణం... నడిరోడ్డుపై ప్రియురాలిని చంపిన ప్రియుడు... !

HT Telugu Desk HT Telugu
Feb 08, 2024 04:40 PM IST

Nirmal District Crime News: నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ప్రియురాలిని నరికి చంపాడు ప్రియుడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిర్మల్ జిల్లాలో దారుణం - నడిరోడ్డుపై దారుణ హత్య
నిర్మల్ జిల్లాలో దారుణం - నడిరోడ్డుపై దారుణ హత్య

Nirmal District Crime News : ఉమ్మడి ఆదిలాబాద్ లోని నడి రోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కేంద్రం లో ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. ఖానాపూర్ శివాజీనగర్లో నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

వివరాల్లోకి వెళ్తే…. శెట్పల్లి అలేఖ్య గురువారం మధ్యాహ్నం పెళ్ళి పనుల నిమిత్తం టైలరింగ్కు వెళ్లి వస్తుండగా శ్రీకాంత్ దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపైనా దాడి చేయడంతో వారికీ గాయాలయ్యాయి. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారిలో 5ఏళ్ళ చిన్నారి కూడా వున్నాడు, మృతురాలి వదిన తలకు తీవ్ర గాయాలు కావడం తో జిల్లా ఆసుపత్రి కి తరలించారు. హంతకున్ని పట్టుకోవడానికి పోలీసులు బృందలుగా వెళ్లి గాలిస్తున్నారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి అదిలాబాద్

WhatsApp channel

టాపిక్