MLA Jagga Reddy New Look: జగ్గారెడ్డి కొత్త లుక్ చూశారా..? గుర్తుపట్టలేరేమో….-congress leader sangareddy mla jagga reddy new look viral on social media ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Congress Leader Sangareddy Mla Jagga Reddy New Look Viral On Social Media

MLA Jagga Reddy New Look: జగ్గారెడ్డి కొత్త లుక్ చూశారా..? గుర్తుపట్టలేరేమో….

HT Telugu Desk HT Telugu
Nov 11, 2022 06:59 PM IST

MLA Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూర్తిగా మారిపోయారు. కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (twitter)

Sangareddy MLA Jagga Reddy: సంగారెడ్డి.... ఈ పేరు వినగానే జగ్గారెడ్డి (అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి) గుర్తొస్తాడు.! జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి... సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అన్నట్లు ఉంటది కథ..! ఆయన ఎమ్మెల్యేగా ఉన్న లేకపోయినా... స్టైల్ మాత్రం ఒక్కటే!. ఇక ఆయన పేరు వినగానే... పెద్ద వెంట్రుకలు, గుబూరు గడ్డమే గుర్తుకు వస్తుంది.! ఆ ఎయిర్‌ స్టైల్‌, గడ్డం, నడక తీరు కూడా అంతే గంభీరంగా ఉంటాయి. మాట తీరు కూడా పక్కా లోకల్ అండ్ మాస్..! ప్రత్యర్థి పార్టీలనే కాదు... పలు అంశాల్లో సొంత పార్టీ నేతలను కూడా కడిగిపారేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా పేరున్న జగ్గారెడ్డికి సంబంధించిన తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన.. శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత... జగ్గారెడ్డిని చూసిన వారు గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడింది. తిరువీధుల్లో ఆయన తిరుగుతున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వెంట్రుకలు, గడ్డం తీసియేడంతో అసలు ఆయన జగ్గారెడ్డియేనా? అని డౌట్ పడుతున్నారు. ఇంకొదరూ ఫొటోను షేర్ చేస్తూ... ఇయన ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ పొస్టులు కూడా పెడుతున్నారు.

ఇక జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆయనకు దైవభక్తి ఎక్కువే. పూజల్లో కూడా బాగా పాల్గొంటారు. ఇక వినాయకచవితి, దేవి నవరాత్రుల వస్తే... భారీగా చందాలు రాస్తుంటారు. ఇక దసరా వస్తే... సంగారెడ్డిలో జగ్గారెడ్డిది పెద్ద సందడే ఉంటుంది. గతంలో పలుసార్లు.. తిరుమలకు పాదయాత్రకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాహుల్ గాంధీ జోడో యాత్ర సంగారెడ్డిలో కొనసాగింది. ఏర్పాట్లన్నీ జగ్గారెడ్డి దగ్గర ఉండి చూశారు. ఈ సందర్భంగా రాహుల్ తో కలిసి సంప్రాదాయ నృత్యాలను కూడా అదరగొట్టేశారు. ఈ వీడియోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

IPL_Entry_Point