Bharat Jodo Yatra in Hyd : నగరంలో జోడో జోష్.. ఉత్సాహంగా రాహుల్‌ పాదయాత్ర-rahul gandhi bharat jodo yatra continues in hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bharat Jodo Yatra In Hyd : నగరంలో జోడో జోష్.. ఉత్సాహంగా రాహుల్‌ పాదయాత్ర

Bharat Jodo Yatra in Hyd : నగరంలో జోడో జోష్.. ఉత్సాహంగా రాహుల్‌ పాదయాత్ర

Nov 02, 2022, 11:41 AM IST HT Telugu Desk
Nov 02, 2022, 10:46 AM , IST

  • Bharat Jodo Yatra in Hyderabad : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. అడుగడుగునా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర (Bharat jodo yatra) భాగ్యనగరంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూకట్ పల్లి, జేఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు పక్కన టీ తాగారు. ఉదయం 10 గంటలకు హోటల్ కినేరా గ్రాండ్ వద్ద మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు.

(1 / 5)

రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర (Bharat jodo yatra) భాగ్యనగరంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూకట్ పల్లి, జేఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగుతోంది. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు పక్కన టీ తాగారు. ఉదయం 10 గంటలకు హోటల్ కినేరా గ్రాండ్ వద్ద మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు. (twitter)

బోయిన్ పల్లి నుంచి యాత్ర ప్రారంభం కాగా... రాహుల్ గాంధీకి పలువురు బోనాలతో స్వాగతం పలికారు. పోతరాజులు నృత్యాలతో అలరించారు. వీటిని ఆసక్తిగా గమనించిన రాహుల్ గాంధీ... పోతరాజులతో పాటు కాళ్లను కదిపారు.

(2 / 5)

బోయిన్ పల్లి నుంచి యాత్ర ప్రారంభం కాగా... రాహుల్ గాంధీకి పలువురు బోనాలతో స్వాగతం పలికారు. పోతరాజులు నృత్యాలతో అలరించారు. వీటిని ఆసక్తిగా గమనించిన రాహుల్ గాంధీ... పోతరాజులతో పాటు కాళ్లను కదిపారు.

బుధవారం 27 కిలోమీటర్ల మేర నడవనున్నారు రాహుల్ గాంధీ. న్యూబోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, ఫిరోజ్ గూడ, జింకలవాడ, ముంబై హైవే, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా మదీనగూడ వరకు యాత్ర ఉంటుంది.

(3 / 5)

బుధవారం 27 కిలోమీటర్ల మేర నడవనున్నారు రాహుల్ గాంధీ. న్యూబోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, ఫిరోజ్ గూడ, జింకలవాడ, ముంబై హైవే, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా మదీనగూడ వరకు యాత్ర ఉంటుంది.(twitter)

సాయంత్రం 7 గంటల సమయంలో ముత్తింగి వద్ద పాదయాత్రకు విరామం ఇస్తారు. అక్కడే కార్నర్ మీటింగ్ ఉంటుంది. రాత్రికి రుద్రారంలోని గణేష్ మందిర్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.

(4 / 5)

సాయంత్రం 7 గంటల సమయంలో ముత్తింగి వద్ద పాదయాత్రకు విరామం ఇస్తారు. అక్కడే కార్నర్ మీటింగ్ ఉంటుంది. రాత్రికి రుద్రారంలోని గణేష్ మందిర్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. (HT)

ఇవాళ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు పూజ భట్.. రాహుల్ తో కలిసి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్‌ జోడో యాత్ర నేపథ్యంలో  నగర పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల కిందట షాద్‌నగర్‌ వద్ద జోడో యాత్రలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా పోలీసులు రాహుల్‌ గాంధీకి మరింత భద్రత పెంచారు. నిఘాను మరింత పెంచారు.

(5 / 5)

ఇవాళ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు పూజ భట్.. రాహుల్ తో కలిసి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్‌ జోడో యాత్ర నేపథ్యంలో నగర పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల కిందట షాద్‌నగర్‌ వద్ద జోడో యాత్రలో చోటు చేసుకున్న ఘటన పునరావృతం కాకుండా పోలీసులు రాహుల్‌ గాంధీకి మరింత భద్రత పెంచారు. నిఘాను మరింత పెంచారు.(twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు