Bharat Jodo Yatra: రాహుల్, జగ్గారెడ్డి అదిరిపోయే స్టెప్పులు - వీడియో వైరల్-congress leader rahul gandhi jodo yatra continues in sangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Congress Leader Rahul Gandhi Jodo Yatra Continues In Sangareddy District

Bharat Jodo Yatra: రాహుల్, జగ్గారెడ్డి అదిరిపోయే స్టెప్పులు - వీడియో వైరల్

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 11:39 AM IST

Bharat Jodo Yatra in Sangareddy: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సంగారెడ్డిలో కొనసాగుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, సీతక్కతో కలిసి రాహుల్ గాంధీ డ్యాన్స్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి
రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి (twitter)

Bharat Jodo Yatra in Telangana: సంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కార్యకర్తలు, నేతలు రాహుల్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలుపుతున్నారు. ఇవాళ పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారులు రాహుల్ కి సంఘీభావంగా నడుస్తున్నారు. రాహుల్ పాదయాత్రలో రిటైర్డ్ నావి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రతిరోజూ ఉదయం 5.55 కి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర గురువారం పొగమంచు కారణంగా ఆలస్యం అయింది. ఉదయం రుద్రారం నుంచి బయల్దేరిన రాహుల్ గాంధీ.. ముందుకు సాగారు. రాహుల్ గాంధీ యాత్రలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోష్ గా కనిపించారు. రేవంత్ రెడ్డి, సీతక్కతో పాటు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శైలజనాథ్ కూడా రాహుల్ గాంధీతో నడిచారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో యాత్రకి టీ బ్రేక్ పడింది. సంగారెడ్డి లోని ఓ హోటల్ లో చాయ్ తాగిన రాహుల్ గాంధీ అక్కడ యువత, స్థానికులతో ముచ్చటించారు.

ఫోక్ డాన్స్...

సంగారెడ్డిలో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి పలువురు కళాకారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వారితో కలిసి స్టెప్పులు వేశారు. రాహుల్ తో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, సీతక్క కూడా జత కలిశారు. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తిరిగి సాయంత్రం 4 గంటలకు శిల్పారామం ఫంక్షన్ హాల్ నుంచి రాహుల్ పాదయాతత్ర తిరిగి మొదలుకానుంది. రాత్రి 7 గంటలకు శివంపేట గ్రామంలో పాదయాత్ర ముగుస్తుంది. ఆందోళ్ నియోజకవర్గంలోని సుల్తాన్ పూర్ గ్రామంలో రాహుల్ గాంధీ బస చేస్తారు.

IPL_Entry_Point