Rahul Gandhi On TRS : టీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ-rahul gandhi respond on alliance with trs in bharat jodo yatra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rahul Gandhi On Trs : టీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ

Rahul Gandhi On TRS : టీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ

HT Telugu Desk HT Telugu
Oct 31, 2022 06:52 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra : ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటిని నాశనం చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలపై దాడులు చేస్తున్నారన్నారు.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం(Modi Govt) కార్పొరేట్ పెద్దల కోసమే పని చేస్తుందని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ నాశనం చేశారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి అవగాహన, పొత్తులు కానీ ఉండవన్నారు.

'మోదీ పాలనలో ఉద్యోగ కల్పన లేదు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగింది. బీజేపీ(BJP) హింసను ప్రేరేపిస్తోంది. దేశవ్యాప్తంగా విద్వేషాలు వ్యాప్తి చేస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను అందరూ వ్యతిరేకించాలి. మేం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తాం. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ పెద్దల కోసమే పని చేస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్(TRS) ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రెండు పార్టీలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.' అని రాహుల్ గాంధీ విమర్శించారు.

బీజేపీపై యుద్ధం 2 నిమిషాల్లో ముగిసేది కాదని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమని చెప్పారు. 2024లో విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఎన్నికలు ఉండబోతున్నాయన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రధాని మోదీ(PM Modi) గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శించారు. వ్యవస్థలన్నింటిని నాశనం చేశారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ విద్వేషాలు వ్యాప్తి చేస్తుందని వ్యాఖ్యానించారు.

దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఉద్యోగ కల్పన లేదన్నారు. భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra)కు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి వెళ్లేలా పాదయాత్ర ప్రణాళిక చేశామన్నారు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉండొదన్నది రాష్ట్ర నాయకత్వ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌(Congress), టీఆర్ఎస్ పార్టీ మధ్య ఎలాంటి అవగాహన లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేస్తుందని నమ్ముతున్నట్టుగా తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం