KCR Released Videos : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర.. వీడియోలు విడుదల చేసిన కేసీఆర్-cm kcr released moinabad farm house trs mla s buying videos ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Released Videos : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర.. వీడియోలు విడుదల చేసిన కేసీఆర్

KCR Released Videos : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర.. వీడియోలు విడుదల చేసిన కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Nov 03, 2022 10:52 PM IST

KCR On TRS MLA'S Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధిన వీడియోలను కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

వీడియోలు విడుదల చేసిన కేసీఆర్
వీడియోలు విడుదల చేసిన కేసీఆర్

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్(KCR) కీలక వీడియోలను విడుదల చేశారు. ఈ వీడియోలలో ఉన్నది రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ అని తెలిపారు. ఆపరేషన్ చేసేవారిలో బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా ఉన్నట్టుగా చెప్పారు.

మమతా బెనర్జి(mamata banerjee)ని ఉద్దేశించి.. మీ 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని ప్రధాని మోదీ(PM Modi) నేరుగా చెప్పారని కేసీఆర్ అన్నారు. ఇక కిందిస్థాయి లీడర్లు ఎలా ఉంటారో ఊహించుకోవచ్చన్నారు. ఇలా అయితే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరారు.

మునుగోడు పోలింగ్(Munugode) ముగిశాక ప్రజల్లోకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌తో వెయిట్ చేశానని కేసీఆర్(KCR) చెప్పారు. మునుగోడులో కూడా వెకిలి ప్రయత్నాలు చేశారన్నారు. చేతుల్లో పువ్వు గుర్తులు, ఫేక్ ప్రచారాలు చేశారన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) సహా అన్ని రాష్ట్రల హైకోర్టు న్యాయమూర్తులను చేతులు జోడించి.. అడుగుతున్నానని కేసీఆర్ చెప్పారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తెలంగాణ(Telangana)లో జరిగిన పరిణామాలపై సమగ్ర వివరాలతో.. దేశంలోని ప్రధాన న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపామని తెలిపారు. ఇది అందరికీ తెలియాల్సిన విషయం అని చెప్పారు.

'ఫాం హౌస్(Farm House) వ్యవహారానికి సంబంధించిన సమగ్ర వివరాలు, 60 నిమిషాల వీడియో తెలంగాణ హైకోర్టు(High Court) సహా.. అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపాం. ఎనిమిది ప్రభుత్వాలను కూలగొట్టాం మరికొన్నింటిని పడగొడతాం అంటున్నారు. ఈ ముఠాలో 24 మంది ఉన్నారు. పెద్ద క్రైం, పార్టీ మారితే వందకోట్లు ఇస్తామంటున్నారు. వై కేటగిరి సెక్యూరిటీ ఇస్తామని హామీ ఇచ్చారు. రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ప్రభుత్వం ఉంది. కాపాడాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్(TRS)లో చేరిన ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్దంగానే చేరారు. ఇలాంటి దురాగతానికి మేం పాల్పడలేదు.' అని సీఎం కేసీఆర్ అన్నారు.

IPL_Entry_Point