Niharika Confession: ఆమెకు అన్నీ తెలుసు… విడిన నవీన్ మర్డర్ మిస్టరీ-btech student niharika reddy confession statement in naveen murder case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Btech Student Niharika Reddy Confession Statement In Naveen Murder Case

Niharika Confession: ఆమెకు అన్నీ తెలుసు… విడిన నవీన్ మర్డర్ మిస్టరీ

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 01:59 PM IST

Niharika Confession: బీటెక్ విద్యార్ధి నవీన్ హత్య కేసులో మిస్టరీ వీడిపోయింది. నవీన్‌ను హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహరకృష్ణ నాలుగు సార్లు నిహారిక రెడ్డిని కలిసినట్లు ఒప్పుకోంది. నవీన్ మృతదేహం ఉన్న ప్రదేశానికి కూడా వెళ్లడమే కాకుండా అతని మాటలు నమ్మి హత్య సంగతి దాచిపెట్టినట్లు వాంగ్మూలమిచ్చింది.

నవీన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
నవీన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

Niharika Confession: అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన బీటెక్‌ విద్యార్ధి నవీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలను నిహారిక బయటపెట్టింది. ఇంటర్ చదువుతున్న రోజుల్లో నవీన్‌ను ప్రేమించినట్లు పోలీసులకు తెలిపింది. తమ ఇంట్లోనే నవీన్‌ను చాలా సార్లు కలిసినట్లు అంగీకరించింది. నవీన్‌తో గొడవ పడితే హరిహరకృష్ణ తమకు సర్ది చెప్పేవాడని పోలీసులకు వివరించింది. నవీన్‌తో గొడవ జరిగినప్పుడు ఆ విషయాలు హరిహర కృష్ణతో చెప్పుకునే దానినని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

నవీన్ తనకు దూరం అయిన తర్వాత హరిహర కృష్ణ తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని అంగీకరించింది. 9నెలలుగా హరిహరకృష్ణతో తాను ప్రేమలో ఉన్నట్లు అంగీకరించింది. మధ్యలో నవీన్ తనతో మాట్లాడడం హరి హరికృష్ణకు నచ్చేది కాదని వాంగ్మూలంలో పేర్కొంది.

నవీన్‌పై పగ పెంచుకున్న హరిహరకృష్ణ

ఈ క్రమంలో నవీన్‌ను చంపేసి, తనను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని చెప్పే వాడని వివరించింది. తాను మందలిస్తే సరదాగా అంటున్నానని చెప్పేవాడని, కొన్ని రోజుల తర్వాత హరిహర కృష్ణ తన ఇంటికి తీసుకెళ్లి నవీన్ను చంపడానికి కొన్న కత్తిని, రెండు జాతుల గ్లౌజుల్ని చూపించినట్లు వెల్లడించింది. నవీన్ ను చంపడానికని చెబితే నమ్మలేదని, అలా చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు పేర్కొంది.

నవీన్‌ తనను మర్చిపోతాడని వారించినట్లు వివరించింది. పిచ్చి పనులు చేయొద్దని హరిని మందలించినట్లు తెలిపింది. హరి సరదాకి అంటున్నానని చెప్పేవాడని పోలీసులకు తెలిపింది. జనవరి 15న హరి ఫోన్ చేసి తన స్నేహితులందరూ 16వ తేదీన గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నామని చెప్పినట్లు వివరించింది.

పార్టీ పేరుతో పిలిచి…

పార్టీకి నవీన్ కూడా వస్తున్నాడని చెప్పాడని, తర్వాత పార్టీ క్యాన్సిల్ అయిందని మరుసటి రోజు హరి ఫోన్ చేసి చెప్పాడని వివరించింది. ఫిబ్రవరి 17న ఉదయం 9:40 గంటలకి నవీన్ తన ఫోన్ నుంచి హైదరాబాద్ వస్తున్నానంటూ తనకు మెసేజ్ చేశాడని, ఆ తర్వాత కొద్దిసేపటికే హరి ఫోన్ చేసి నవీన్ వస్తున్న విషయం చెప్పాడని తెలిపింది. నవీన్ కాల్ చేస్తే తాను వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నానని చెప్పమన్నాడని వివరించింది.

తాను నవీన్‌తో అదే విషయం చెప్పానని ఎందుకు అలా చేస్తున్నావని నవీన్ అంటుండగానే ఫోన్ కట్ చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత హరి ఫోన్‌ చేసి నవీన్ ఇక నీతో మాట్లాడడని చెప్పాడని తెలిపింది. మరుసటి రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి తనను కలవాలని మెసేజ్ చేశాడన వివరించింది.

శివరాత్రి రోజున ఉదయం 9:30 కి.. వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీద హరిని కలిసినట్లు నిహారిక వివరించింది. హరి పాత బట్టలు వేసుకుని రావడంతో ఇలాంటి బట్టలు వేసుకున్నావని అడిగితే , నవీన్‌ని రాత్రి చంపేసినట్లు చెప్పాడని వివరించింది. తన బట్టలకు రక్తం అంటితే హసన్ బట్టలు వేసుకున్నానని చెప్పాడని తెలిపింది.

హసన్‌కి కూడా అప్పటికే నవీన్ హత్య విషయం చెప్పానని, హసన్ తో కలిసి నవీన్ అవయవాలు ఉన్న బ్యాగ్ ని వారి ఇంటికి దూరంగా.. చెట్లలో పడేసినట్లు తనకు చెప్పినట్లు నిహారిక వివరించింది. ఎందుకు అలా చేశావని అడిగానని, వేరేలా మాట్లాడుకుని ఉండొచ్చు కదా అన్నట్లు వివరించింది. ఆ తర్వాత హరి వరంగల్ వెళ్లడానికి డబ్బులు కావాలని అడిగితే హరికి రూ.1500 ఇచ్చినట్లు వివరించింది.

డబ్బులు తీసుకుని, తండ్రి దగ్గరకు వెళ్లి….

హరి తన తండ్రి దగ్గరికి వరంగల్ వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడని వివరించింది. తాను నవీన్ స్నేహితులకు కానీ పోలీసులకు కానీ, ఎవరికి చెప్పకుండా దాచి పెట్టినట్లు ఒప్పుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో, హరి ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్ స్టాప్ లో నన్ను కలిశాడని తెలిపింది.

కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నవీన్‌ని చంపిన చోటు... తలపడేసిన చోటుని చూపిస్తానని చెప్పి, బండిమీద ఎక్కించుకొని బి.యన్.రెడ్డి నగర్ మీదుగా సాగర్ కాంప్లెక్స్ దగ్గర చెత్త పడేసిన చోట హరి బట్టలు పడేసిన ప్రదేశాలు చూపించినట్లు వివరించింది. అక్కడి నుండి రాజీవ్ గృహకల్ప దగ్గర బ్యాగు పారవేసిన ఏరియాను, బ్రాహ్మణపల్లి దగ్గర ఒక కంపెనీ ప్రక్కన నవీన్ తలని అతని ప్యాంటు, కత్తిని మరియు సెల్ ఫోన్ పడేసిన స్థలాన్ని దూరం నుంచి చూపించినట్లు వాంగ్మూలంలో పేర్కొంది.

అబ్దుల్లాపూర్‌లో బిర్యానీ తిని, శవాన్ని చూసి….

ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుమీదుగా వెళ్లి... అబ్దుల్లాపూర్మెట్ లో అమృత ఫ్యామిలీ డాబా లో సాయంత్రం 4:30 గంటలకు బిర్యానీ తిన్నామని వెల్లడించింది. అక్కడి నుంచి తిరిగి వస్తూ నవీన్ ను చంపిన ప్లేస్ ఇటువైపు అని దారిలో నాకు చూపించాడని వెల్లడించింది. ఆ తర్వాత తనను ఇంటి దగ్గర దింపేసి అక్కడ నుండి వెళ్లి పోయాడని వివరించింది.

నవీన్ ఫ్రెండ్ తరుణ్ కాల్ చేసి ... నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని హైదరాబాద్‌లో ఇంటర్ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాడని, తనను కలిసాడా అని అడిగితే , నవీన్ ని హరి చంపిన విషయం దాచిపెట్టి... నవీన్ గురించి తెలియదని చెప్పినట్లు అంగీకరించింది. కామన్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని, అతని ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగితే ...హరి ఫోన్ నెంబర్ మెసేజ్ చేసినట్లు వివరించింది.

నవీన్ బంధువులను మభ్యపెట్టి…

ఫిబ్రవరి 21 ఉదయం 10 గంటలకు నవీన్ మేనమామ హరికి ఫోన్ చేసి అబ్దుల్లా పూర్ మెట్‌ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇద్దాం హరిని రమ్మనట్లు, తనతో హరి చెప్పాడని వివరించింది. దాంతో హరి తన ఫోన్ స్విచాఫ్ చేసుకుంటాను ఏదైనా ఉంటే ఎవరి ఫోన్ తోనైనా ఫోన్ చేసి తెలుసుకుంటానని చెప్పాడని పేర్కొంది. తనను హసన్‌తో ఫోన్లో టచ్ లో ఉండమని హరి చెప్పినట్లు వివరించింది., తర్వాత హరి ఫోన్ స్విచాఫ్ చేసి వెళ్ళిపోయాడని, అదే రోజు సాయంత్రం మళ్లీ తరుణ్ నాకు కాల్ చేసి... నవీన్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే నాకు తెలియదు అని చెప్పానని ఒప్పుకుంది.

నవీన్ మామ కూడా తనకు ఫోన్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని అడిగాడని, నాకు తెలియదు అని చెప్పానని, ఆ తర్వాత భయం వేసి, మా బావ భూపాల్ రెడ్డికి జరిగిన విషయం చెప్పకుండా దాచిపెట్టి, నవీన్ అనే అబ్బాయి తప్పిపోయాడని తనకు ఫ్రెండ్స్ చేస్తున్నారని చెప్పానంది. నవీన్ మామ ఫోన్ చేసి.. అడుగుతుంటే.. తన బావ భూపాల్ రెడ్డి ఫోన్ తీసుకొని అతనితో మాట్లాడి మీ అబ్బాయి గురించి తెలియదని, తాను అడ్వకేట్ నని, పదేపదే నిహారిక కి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండని చెప్పడంతో తర్వాత నాకు ఎవరు ఫోన్ చేయలేదని తెలిపింది.

పారేసిన భాగాలను వెదికి తీసుకొచ్చి….

ఫిబ్రవరి 23న హసన్ కు కాల్ చేయడంతో హరి మిస్సయినట్లు, వాళ్ళ అక్క బావ మలక్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని తెలిసిందన్నారు. తనను కూడా పోలీస్ స్టేషన్ కి పిలుస్తున్నారని, తాను వెళ్తున్నాను... ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చేయమని హసన్ చెప్పాడని పోలీసులకు వివరించింది. తనను కూడా పోలీస్ స్టేషన్ కి పిలుస్తారేమో అని హసన్ హెచ్చరించాడని, తాను కొంత చాట్ ని ఇంస్టాగ్రామ్ లో మెసేజీలు అన్ని డిలీట్ చేశానని అంగీకరించింది.

మరుసటి రోజు.. ఫిబ్రవరి 24న తన స్నేహితురాలికి హసన్ ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజీ వచ్చిందని, నిహారికని ఎవరికి ఫోన్ చేయవద్దని హెచ్చరించినట్లు తెలిపింది. హరి గురించి ఎవరైనా అడిగితే తెలియదు అని చెప్పమని హసన్ మెసేజ్ చేసాడని వివరించింది. తన స్నేహితురాలు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పిందన్నారు.

24వ తేదీ ఉదయం సుమారుగా 8:30 గంటలకు ఎన్జీవోస్ కాలనీ బస్టాప్ లో బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తుంటే హరి వచ్చి బస్సు దగ్గర నిలబడి ఉన్నాడని, తన ఫ్రెండ్ హరిని చూసి తనకు చెప్పిందని, హరిని చూసిన నేను బస్సు దిగి వెళ్ళి అతనితో మాట్లాడినట్లు తెలిపింది. హరి తనతో మాట్లాడి... పోలీసులకు లొంగిపోతాను అన్నాడని, తన ఫోన్ నుంచి హసన్ కి ఫోన్ చేసి ...బ్రాహ్మణపల్లి గేట్ దగ్గరికి రమ్మని చెప్పి వెళ్లిపోయాడని వివరించింది. ఆ తర్వాత హరి మధ్యాహ్నం ఒంటిగంటకు కాల్ చేసి నన్ను హస్తినాపురం బస్ స్టాప్ వద్ద ఉండమంటే అక్కడ వెయిట్ చేశానని తెలిపింది. ఆ తర్వాత హరి,హసన్ కలిసి పడేసిన శరీర భాగాల కోసం వెళ్లినట్లు వాంగ్మూలంలో వివరించింది.

నిహారిక, హసన్‌ వాంగ్మూలాల ఆధారంగా ఏ1‌గా హరిహరకృష్ణ, ఏ2గా హసన్, ఏ3గా నిహారికాలపై అభియోగాలు నమోదు చేశారు.

IPL_Entry_Point